Dell G7 15 సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ వచ్చేసింది!! ధర ఎక్కువే...

|

ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ డెల్ ఇండియాలో ఇప్పుడు మరోక కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 15 అంగుళాల ఫుల్-‌హెచ్‌డి యాంటీ గ్లేర్ డిస్ప్లే మరియు సన్నని బెజెల్స్ ప్రొఫైల్‌ నిర్మాణంతో డెల్ G7 15 7500 ను కంపెనీ ఇప్పుడు ఆవిష్కరించింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ ఇంటెల్ యొక్క 10 వ తరం కోర్ ప్రాసెసర్‌లు మరియు ఎన్విడియా జిఫోర్స్ RTX గ్రాఫిక్స్ కార్డ్ ద్వారా రన్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డెల్ G7 15 ల్యాప్‌టాప్‌ ధర మరియు లభ్యత వివరాలు

డెల్ G7 15 ల్యాప్‌టాప్‌ ధర మరియు లభ్యత వివరాలు

డెల్ G7 15 ల్యాప్‌టాప్‌ రెండు వేరు వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కోర్ i7 మరియు 16GB ర్యామ్ మరియు 1TB SSD వేరియంట్ యొక్క ధర రూ.1,61,990 కాగా, కోర్ i9 మోడల్ 16GB ర్యామ్ మరియు 1TB SSD వేరియంట్ యొక్క ధర రూ.2,07,990. ఈ ల్యాప్‌టాప్ మినరల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లతో పాటు కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి త్వరలోనే అందుబాటులోకి రానున్నది.

 

Also Read: Facebook & ఇన్‌స్టాగ్రామ్‌ను మాతృ భాషలోకి మార్చడం ఎలా?Also Read: Facebook & ఇన్‌స్టాగ్రామ్‌ను మాతృ భాషలోకి మార్చడం ఎలా?

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ కేవలం 18.3mm మందంతో ఇరిడెసెంట్ సిల్వర్ యాసలు, 4-జోన్ అనుకూలీకరించదగిన RGB WASD కీబోర్డ్, మరియు 12-జోన్ చట్రం లైటింగ్, మినరల్ బ్లాక్ చట్రం వంటి ఫీచర్లు వినియోగదారులకు గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందిస్తుంది. వినియోగదారులు తమ రోజువారి పని నుండి రిలీఫ్ కోసం అద్భుతమైన గేమింగ్ సెషన్‌కు మారడానికి ఇది వీలు కల్పిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 

Also Read: ల్యాప్‌టాప్ లపై భారీ ఆఫర్లు! కొనాలంటే ఇదే సమయం!Also Read: ల్యాప్‌టాప్ లపై భారీ ఆఫర్లు! కొనాలంటే ఇదే సమయం!

డెల్ G7 15 ల్యాప్‌టాప్ గేమింగ్ ఫీచర్స్

డెల్ G7 15 ల్యాప్‌టాప్ గేమింగ్ ఫీచర్స్

డెల్ G7 15 అనేది గేమింగ్ ల్యాప్‌టాప్ అయినప్పటికీ ఇది దాని పోటీదారుల కంటే సన్నని డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ లో విండోస్ 10 ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది 15-అంగుళాల ఫుల్-హెచ్‌డి స్క్రీన్ ను 1,920x1,080 పిక్సెల్స్ యాంటీ గ్లేర్ LED డిస్‌ప్లేను 300Hz అధిక రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటుంది.

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ గ్రాఫిక్స్ కార్డు స్లాట్ ఫీచర్స్

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ గ్రాఫిక్స్ కార్డు స్లాట్ ఫీచర్స్

డెల్ G7 15 ల్యాప్‌టాప్ యొక్క సాఫ్ట్ వెర్ విషయానికి వస్తే శక్తికోసం సరికొత్త 10వ తరం ఇంటెల్ కోర్ i9-10885H ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు ఎన్విడియా జిఫోర్స్ RTX గ్రాఫిక్స్ కార్డ్ 8GB GDDR6 ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎన్విడియా జిఫోర్స్ RTX 2070 GPU మరియు మాక్స్-క్యూ డిజైన్‌తో వినియోగదారులు క్రిస్టల్ స్పష్టమైన వివరాలు మరియు వాస్తవిక గేమ్‌ప్లేతో అధిక సెట్టింగులతో అన్ని రకాల గేమ్ లను ఆడటానికి వీలును కల్పిస్తుంది.

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ కనెక్టివిటీ ఎంపికలు

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ కనెక్టివిటీ ఎంపికలు

డెల్ G7 15 గేమింగ్ ల్యాప్‌టాప్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో HDMI 2.0, మూడు సూపర్‌స్పీడ్ USB 3.2 జెన్ వంటివి ఉన్నాయి. వీటిలో ఒక టైప్-A, పవర్‌షేర్‌తో ఒకటి మరియు 2-ఇన్ -1 SD/ మైకోమీడియా కార్డ్ స్లాట్ వంటివి ఉన్నాయి. డెల్ G7 15 లో 86Whr, 6-సెల్ బ్యాటరీ మరియు 240 వాట్ AC అడాప్టర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 18.3 x 357.2 x 267.7mm కొలతల నిర్మాణంతో పాటు 2.183 కిలోల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Dell G7 15 Gaming Laptop Released in India: Price, Specs and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X