హెడ్‌సెట్స్‌కి హెడ్‌ఫోన్స్‌కి మధ్య తేడాలు ఏమిటి ?

|

హెడ్సెట్, హెడ్ఫోన్ ఈ రెండు వాటి ఆకృతులలో మరియు ఫంక్షన్లలో కొన్ని తేడాలను మాత్రమే కలిగి ఉంటాయి. వీటి గురించిన అవగాహన ఇవ్వడం కోసం ఈ ఆర్టికల్ పొందుపరచడం జరిగినది. ఇక్కడ పొందుపరచిన విషయాల ద్వారా వినియోగదారుడు ఈ రెండింటిలో ఏది కొనాలో అన్న నిర్ణయానికి రాగలరు.

 

హెడ్ సెట్ : హెడ్ సెట్ ను మైక్రోఫోన్ కలిగిన ఒక హెడ్ ఫోన్ లా భావించవచ్చు. హెడ్ సెట్ మైక్రో ఫోన్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకంలో హెడ్ సెట్ లో ఒక బూమ్(ఒక చెవి పక్క) కి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ మైక్ పైకి కిందకి కదుల్చుటకు అనువుగా ఉండి, అవసరమైనప్పుడే మైక్ ని ఉపయోగించుకునేలా ఉంటుంది. రెండవరకం హెడ్ సెట్ లో మైక్ బూమ్ కి అనుసంధానంగా కాకుండా హెట్ సెట్ వైర్ లో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనిని ఇన్లైన్ మైక్రోఫోన్ అని కూడా అంటారు. దీనిని కంప్యూటర్, లాప్టాప్ కు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ హెడ్ సెట్ కు రెండు 3.5 MM జాక్స్ (స్పీకర్ మరియు మైక్రోఫోన్) ఉంటాయి , లేదా USB తో అనుసంధానం చేసేవి లా ఉంటాయి. ఎక్కువగా దీనిని గేమింగ్ కోసం , కస్టమర్ కేర్ సర్వీసెస్ వారు VOIP సేవల కోసం ఈ హెడ్ సెట్స్ ని ఉపయోగిస్తుంటారు. ఈ హెడ్ సెట్ లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి
1) Microphone style headsets
2)Noise-canceling
3)Directional characteristics headsets.

హెడ్ సెట్ హెడ్ ఫోన్ ఇంచుమించు ఒకేలా ఉన్నా, హెడ్ సెట్ లో ఖచ్చితంగా మైక్రో ఫోన్ పొందుపరచబడి ఉంటుంది.

కళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతంకళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతం

హెడ్‌సెట్స్‌కి హెడ్‌ఫోన్స్‌కి మధ్య తేడాలు ఏమిటి ?

Head phones :

హెడ్ ఫోన్స్ ఇంచుమించు హెడ్ సెట్ లక్షణాలను కలిగిఉన్నా , కొన్ని ఇతర అమరికలు కూడా ఉంటాయి. స్పీకర్లను పూర్తిగా చెవులకు అందుబాటులో ఉంచడం ద్వారా సౌండ్ క్వాలిటీని పరిపూర్ణత తో ఆస్వాదించే వెసులుబాటు ఉంటుంది. మామూలుగా ఇది ఒకే ఒక 3.5 mm జాక్ ద్వారా కాని, బ్లూటూత్ కనెక్టివిటీని కాని కలిగి వస్తుంది. హెడ్సెట్ తో పోల్చి చూస్తే హెడ్ఫోన్స్ లోనే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది కూడా . ఎక్కువగా వీటిని మొబైల్ ఫోన్స్ , ఐపాడ్ వంటి వాటికోసం వినియోగిస్తుంటారు. ఈమధ్య 40 mm డ్రైవర్స్ వినియోగిస్తున్న హెడ్ఫోన్స్ సైతం బడ్జెట్ రేంజులోనే లభిస్తుండడం గమనార్హం.

 

ఈ హెడ్ ఫోన్లలో కూడా పలురకాలు ఉంటాయి.
1)On ear headphones 2)Around ear headphones 3)Wireless headphones 4)Wired headphones 5)Earphones 6)Over ear headphones 7) in ear

సంగీతం ఆస్వాదించడానికి స్పీకర్లతో పనిలేకుండా హెడ్ ఫోన్స్ చెవులకు దగ్గరగా స్పీకర్లను ఉంచడం ద్వారా మని సౌండ్ క్వాలిటీ కలిగిన అనుభూతిని ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు హెడ్ఫోన్స్ లో కూడా మైక్ అరేంజు చేయబడి వస్తుంది. తద్వారా వీటి పేర్లు కూడా ఒకదానితో ఒకటి మార్చుకుంటూ వినియోగదారునికి సందేహాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ హెడ్ ఫోన్స్ కాని హెడ్ సెట్స్ కాని తయారుచేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రపంచంతో సంబంధంలేకుండా సౌండ్ ఆస్వాదించడానికే.

హెడ్‌సెట్స్‌కి హెడ్‌ఫోన్స్‌కి మధ్య తేడాలు ఏమిటి ?

మార్కెట్లో అనేకరకాల హెడ్ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. కాని వినియోగదారులు వాటిని కొనేముందు ఒకటికి పది సార్లు వాటికి సంబంధించిన వీడియోలు చూడడం కాని, రివ్యూస్ చదవడం వలన కాని ఒక అవగాహనకు వచ్చాకే హెడ్ ఫోన్స్ కొనడం మంచిది . ఒక్కోసారి అంత ఖరీదు పెట్టి కొన్న తర్వాత కంఫర్ట్ feel కాలేకపోతే వృధానే అవుతుంది. కేవలం వోకల్స్ ఎక్కువ ఇష్టపడేవారికోసం కూడా కొన్ని హెడ్ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న హెడ్ ఫోన్స్ లో బ్లూటూత్, కీ కంట్రోల్స్, మైక్ , best కుషన్ ఉండేలా కంపెనీలు జాగ్రత్త వహిస్తున్నాయి కూడా. ఇక్కడ మీ అవసరాలకు, బడ్జెట్ కు తగ్గట్లుగా ఎన్నుకోవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
What Is The Difference Between Headsets, Headphones, And Earphones? more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X