Dizo నుంచి అందుబాటు ధరలో మరో కొత్త Smart Watch, Neckband విడుదల!
Realmeటెక్‌లైఫ్ సిస్టం బ్రాండ్ Dizo రోజురోజుకు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విస్తరింపజేస్తోంది. తాజాగా పలు సరికొత్త మోడల్ Dizo Watch D Sharp స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ యాక్టివ్ Neckband ను విడుదల చేసింది. రియల్‌మీ టెక్‌లైఫ్ ఎక్ సిస్టమ్ నుంచి ఈ ప్రొడక్ట్స్ భారత్‌లో విడుదల అయ్యాయి. అఫర్డబుల్ ధరలో Dizo Watch D Sharp స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వాచ్ అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

Dizo Watch D Sharp ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Dizo Watch D Sharp యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 320×390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల రెక్టాంగ్యులర్ డిస్‌ప్లేతో వస్తుంది. నావిగేషన్ కోసం దీనికి కుడి వైపున ఒక బటన్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్లడ్ ఆక్సిజన్,హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 110 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.
అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి 5ATM సౌకర్యాన్ని కలిగి ఉంది. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 14 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీన్ని బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది.

Dizo వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్:
ఈ Dizo వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్ 11.2 ఎంఎం బేస్ బూస్టింగ్ డ్రైవర్స్‌తో వస్తున్నాయి. ఇయర్‌ఫోన్స్ రెండింటికి మ్యాగ్నెటిక్ కనెక్షన్ అందిస్తున్నారు. డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్, ట్రిపుల్ ప్రెస్ పద్దతి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనికి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా 23 గంటల వరకు లైఫ్ ఇస్తుంది.
భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఉత్పత్తుల ధరలు:
ఈ Dizo Watch D Sharp స్మార్ట్‌వాచ్ ధరను కంపెనీ రూ.2,999 గా నిర్ణయించింది. ఇది క్లాసిక్ బ్లాక్, డీప్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక డిజో యాక్టివ్ నెక్ బ్యాండ్ విషయానికి వస్తే.. భారత మార్కెట్లో దీని ధర రూ.1,199 గా నిర్ణయించారు. ఇవి క్లాసిక్ బ్లాక్ మెటార్ గ్రే, ఇండిగో బ్లూ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇక Dizo Buds P వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ విషయానికి వస్తే.. రూ.1,299 కి కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Dizo Watch S యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 1.57-అంగుళాల రెక్టాంగ్యులర్ డిస్‌ప్లేతో వస్తుంది. నావిగేషన్ కోసం దీనికి కుడి వైపున ఒక బటన్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్లడ్ ఆక్సిజన్,హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.
అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.0 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 7 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీన్ని బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








