టెక్నాలజీ మహిమ: జేబులో పట్టే వాషింగ్ మిషన్‌..

Written By:

టెక్నాలజీ రోజురోజుకు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో మీ ఇంట్లో ప్రతి వస్తువు గాడ్జెట్ మీదనే ఉంటుంది. కిచెన్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ బెడ్ రూం దాకా అన్ని గాడ్జెట్ వస్తువలే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు ఓ కొత్త గాడ్జెట్ ని పరిచయం చేయబోతున్నాం.. అదేంటంటే వాషింగ్ మిషన్.

టెక్నాలజీ మహిమ: జేబులో పట్టే వాషింగ్ మిషన్‌..

మాములుగా బట్టలు ఉతుకుతుంటే దాన్ని అటూ ఇటూ లాగడం వల్ల అది చిరిగిపోవడమే లేకుంటే దారాలు బయటకి రావడమో జరుగుతూ ఉంటుంది. వాషింగ్ మిషన్ లో వేసినా కాని ఒక్కోసారి అదేసీన్ రిపీట్ అవుతుంటుంది. అయితే ఈ గాడ్జెట్ తో మీకు అలాంటి సమస్యలు ఉండవు..ఇంకా విచిత్రమేమిటంటే దీన్ని పాకెట్ లో పెట్టుకుని మీరు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఢిపరెంట్ ఫోన్: బ్యాటరీ బ్యాకప్ 15 సంవత్సరాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీని పేరు డాల్ఫీ..

దీని పేరు డాల్ఫీ.. చూసేదానికి కోడిగుడ్డు ఆకారంలో ఉంది కదా..పొరపాటును గుడ్డు అనుకేనేరు ఇది వాచింగ్ మిషన్ మీ బట్టలను 30 నిమిషాల్లో ఉతికేస్తుంది.

ఇది సోప్ లాగా మీ బట్టలను ఉతికేస్తుంది.

ఇది సోప్ లాగా మీ బట్టలను ఉతికేస్తుంది. మీ బట్టలను సింక్ లో వేసి దీన్ని ఆ బట్టపై ఉంచితే చాలు దానంతట అదే పనిచేసుకుంటూ పోతుంది.

దీన్ని జర్మనీ వాళ్లు తయారుచేశారు. ఇంకా ప్రారంభ దశలో

దీన్ని జర్మనీ వాళ్లు తయారుచేశారు. ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇది అతి చిన్న వాషింగ్ మిషన్. దీన్ని మీరు జేబులో కూడా పెట్టుకుని వెళ్లవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ బ్యాగులో పెట్టుకుని వెళ్లవచ్చు.

బట్టలను ఉతికే సమయంలో

ఇది బట్టలను ఉతికే సమయంలో మీ బట్టలకు దారాలు బయటకు రావడం కాని లేక మరేదైనా జరగడం కాని ఉండదు. అంతే కాకుండా మీకు పవర్ ఆదా కూడా చేస్తుంది. దాదాపు 80 శాతం పవర్ ఆదా చేస్తుంది.

ఇది పనిచేసే సమయంలో

ఇది పనిచేసే సమయంలో మీకు ఎటువంటి శబ్దాలు కూడా రావు అదే. వాషింగ్ మిషన్ అయితే పెద్దగా సౌండ్ చేస్తుంది కదా.

ఇప్పటికే చాలా మెడికల్ అప్లికేషన్లలో

దీన్ని ఇప్పటికే చాలా మెడికల్ అప్లికేషన్లలో ఉపయోగించారు. అక్కడ ఇది విజయవంతంగా పనిచేసింది. ఇది ఆల్ట్రాసోనిక్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

మీ దగ్గర ఉంటే మీ వాషింగ్ మిషన్ తో పనే ఉండదని

ఇది మీ దగ్గర ఉంటే మీ వాషింగ్ మిషన్ తో పనే ఉండదని దీన్ని తయారుచేసిన ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Dolfi Is A Washing Machine You Can Carry Around In Your Pocket
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot