వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

Written By:

'ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు'. ఈ ప్రముఖ సినిమా డైలాగ్‌లో బోలెడంత అర్థముంది. టెక్నాలజీ గాడ్జెట్‌ల కొనుగోలు విషయంలోనూ అంతే. ఏ వస్తువుకు ఎక్కువ ఖర్చు పెట్టాలో, ఏ వస్తువు ఎక్కువ ఖర్చుపెట్టకూడదో తెలిసినవాడే అసులు‌సిసలైన టెక్ ఎక్స్‌పర్ట్.

Read More : ఈ ఫోన్‌లలో 5 రోజుల బ్యాటరీ బ్యాకప్ గ్యారంటీ!

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

టెక్నాలజీ ఉత్పత్తుల విషయంలో క్వాలిటీ అనేది చాల తప్పనిసరి. క్వాలిటీ అనేది నూటికి నూరుపాళ్లు జెన్యున్ వస్తువుల్లోనే దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో బ్రాండెడ్ వస్తువుకు, అన్‌బ్రాండెడ్ వస్తువుకు మధ్య తేడాలను గమనించలేం. రెండు సమానంగానే పని చేస్తుంటాయి. లాంగ్ రన్‌లోకి వచ్చే సరికి అన్‌బ్రాండెడ్ వస్తువు మన్నికను కొల్పోయి నిస్సత్తువుగా మారిపోతుంది.

Read More : 6జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్‌, రూ.11,999 నుంచి

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

కొంత మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసి వాటికి అవసరమయ్యే యాక్సెసరీస్ కొనుగోలు విషయంలో మాత్రం చౌకబారుగా ఆలోచిస్తుంటారు. బ్రాండెడ్ వస్తువులకు అన్‌బ్రాండెడ్ ఉపకరణాలను కనెక్ట్ చేయటం ద్వారా అరకొర నాణ్యతతోనే సరిపెట్టుకోవల్సివస్తుంది. ఇక్కడ ప్రస్తావించబోయే 6 ఎలక్టానిక్ గాడ్జెట్‌ల కొనుగోలు విషయంలో ఏ మాత్రం చౌకబారుగా వ్యవహరించినా మీరు సంతృప్తిపడలేరు. అవేంటో తెలుసుకుందామా మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

చీప్ క్వాలిటీ హెడ్‌ఫోన్స్ ద్వారా మన్నికైన మ్యూజిక్‌ను మీరు ఆస్వాదించలేరు. రోడ్‌సైడ్ దుకాణాల్లో అలానే ఫుట్‌పాత్ బజార్‌లలో విక్రయించే చీప్ క్వాలిటీ హెడ్‌ఫోన్‌లు ఏ క్షణం వరకు పనిచేస్తాయో చెప్పలేం. వీటిలో క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మనసును హత్తుకునే నాణ్యమైన మ్యూజిక్‌ను ఆస్వాదించాలనుకుంటే కచ్చితంగా బ్రాండెడ్ హెడ్‌ఫోన్‌లను వాడితీరా

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

బ్యాటరీలు రెండు రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి ఆల్కాలైన్ మరొకటి లిథియమ్. వీటిలో లిథియమ్ బ్యాటరీలను బెస్ట్ బ్యాటరీలుగా చెప్పుకోవచ్చు. ఇవి రీఛార్జబుల్ కానప్పటికి హైఎండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వ్యవస్థను కలిగి ఉంటాయి. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కోసం రీఛార్జబుల్ బ్యాటరీలను ఎంపిక చేసుకునే విషయంలో టాప్‌ఎండ్ బ్యాటరీలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

చీప్ క్వాలిటీ యూఎస్బీ కేబుల్స్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్‌ఫర్‌ను మీరు ఆస్వాదించలేరు. రోడ్‌సైడ్ దుకాణాల్లో అలానే ఫుట్‌పాత్ బజార్‌లలో విక్రయించే చీప్ క్వాలిటీ యూఎస్బీ కేబుల్స్ ఏ క్షణం వరకు పనిచేస్తాయో చెప్పలేం. వీటి మన్నిక కూడా నామమాత్రంగానే ఉంటుంది.

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

కెమెరా లెన్స్ ఎంత మన్నికగా ఉంటే, ఆ ఫోటోగ్రఫీ అంత క్వాలిటీగా ఉంటుంది. నాసిరకం లెన్సును కొనగోలు చేయటం ద్వారా క్వాలిటీ ఫోటోగ్రఫీని మీరు ఆస్వాదించలేరు

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

కంప్యూటింగ్ ప్రపంచంలో కీబోర్డ్ కీలక వస్తువు. కీబోర్డులను రఫ్ అండ్ టఫ్‌గా వాడేస్తుంటాం కాబట్టి వీటి ఎంపిక విషయంలో ఎల్లప్పుడు నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణ కీబోర్డులతో పోలిస్తే ప్రీమియమ్ మోడల్ కీబోర్డ్స్ మన్నికైన పనితీరును కనబరుస్తాయి.

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్, మీ అవసరాలకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. వేగవంతమైన ప్రాసెసర్, క్రిస్ప్ డిస్‌ప్లే, పటిష్టమైన బిల్డ్‌బాడీ వంటి అంశాలు మీరు కొనే ల్యాప్‌టాప్‌లో తప్పనిసరిగా ఉండాలి. నాసిరకం ల్యాప్‌టాప్‌లలో ఈ మంచి లక్షణాలు మచ్చుకైనా కనిపించవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Don't Be Cheap: Push Your Budget While Buying These 6 Devices. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot