Home
Gadgets

55 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC సపోర్టుతో Dyson OnTrac హెడ్‌ఫోన్స్‌ విడుదల.. ధర, సేల్‌ పూర్తి వివరాలు..!

Dyson భారత్‌ మార్కెట్‌లో హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. Dyson OnTrac పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హెడ్‌ఫోన్స్‌ కొన్ని దేశాల్లో జులైలోనే విడుదల అయ్యాయి. CNC సిరామిక్‌ లేదా యానోడైజ్‌ అల్యూమినియం క్యాప్స్‌తో కూడిన అల్యూమినియం ఫ్రేమ్‌ ను కలిగి ఉంటాయి. మీకు నచ్చిన రంగుల్లో ఇయర్‌ కప్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్‌ ఎక్కువ గంటలపాటు బ్యాటరీ లైఫ్‌, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. Dyson OnTrac హెడ్‌ఫోన్స్‌ 40dB యాక్టివ్‌ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 55 గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్‌ పూర్తి వివరాలు.

డైసన్‌ ఆన్‌ట్రాక్‌ హెడ్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌లు :
ఈ హెడ్‌ఫోన్‌ 40mm నియోడైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్‌ 40dB ANC సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు డబుల్‌ ట్యాప్‌ గెశ్చర్‌ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు హెడ్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. మీ చెవి నుంచి ఇయర్‌బడ్స్‌ను తొలగిస్తే మ్యూజిక్‌ కూడా నిలిచిపోతుంది. ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లో ఆఫ్‌ చేయాల్సిన అవసరం లేదు.

Dyson OnTrac headphones

దీంతోపాటు ఈ డైసన్‌ ఆన్‌ట్రాక్‌ హెడ్‌ఫోన్‌ మూడు కస్టమ్ EQ మోడ్‌లను కలిగి ఉంటుంది. బాస్‌ బూస్ట్‌, న్యూట్రల్‌, Enhanced ఆప్షన్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు టచ్‌ కంట్రోల్‌ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్‌, Skip చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్‌లు అత్యంత మెరుగైన ఆడియోను అందిస్తాయి.

ఈ హెడ్‌ఫోన్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 55 గంటలపాటు వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2.5 గంటల ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చు. అదే 30 నిమిషాల ఛార్జింగ్‌తో 9.5 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

Dyson OnTrac headphones

డైసన్‌ ఆన్‌ట్రాక్‌ హెడ్‌ఫోన్‌ క్యాప్స్‌ CNC సిరామిక్‌ లేదా యానోడైజ్‌ అల్యూమినియం తయారుచేయబడ్డాయి. ఇయర్ కుషన్‌ మరింత సౌకర్యంగా ఉండేందుకు వీలుగా మైక్రో ఫైబర్‌ మెటీరియల్‌ను వినియోగించారు. ఈ హెడ్‌ఫోన్ బరువు 451 గ్రాములుగా ఉంటుంది. బ్లూటూత్ 5.0 ఫీచర్‌తో పనిచేస్తుంది.

డైసన్‌ ఆన్‌ట్రాక్‌ హెడ్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు : డైసన్‌ ఆన్‌ట్రాక్‌ హెడ్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ధర రూ.44,900 గా ఉంది. ఈ హెడ్‌ఫోన్‌ను భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డైసన్‌ ఇండియా వెబ్‌సైట్‌, డైసన్ డెమో స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ Dyson OnTrac హెడ్‌ఫోన్‌ లను అనేక రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. CNC అల్యూమినియం, CNC బ్లాక్‌ నికిల్‌, సిరామిక్‌ చిన్నబార్, CNC కాపర్‌ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు కొనుగోలు దారులు ఈ హెడ్‌ఫోన్‌ ను కస్టమైజ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

Dyson OnTrac హెడ్‌ఫోన్‌ ఎక్కువ కాలం మన్నిక అందిస్తాయని సంస్థ చెబుతోంది. Ontrac హెడ్‌ఫోన్‌లతోపాటు డైసన్‌ సంస్థ washG1 వెట్‌ ఫ్లోర్ క్లినర్‌ సహా ఇతర ఉత్పత్తులను భారత్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ హెడ్‌ఫోన్‌ డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Dyson OnTrac headphones with 55 hours of battery life and ANC launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X