Home
Gadgets

LG నుంచి కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్.. S95TR, S90TYలతో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా..!

LG Soundbars: సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ LG, ఇండియాలో ఇద్దరు కొత్త సౌండ్‌బార్ హీరోలను లాంచ్ చేసింది. వాళ్ల పేర్లు LG S95TR, LG S90TY. ఈ సౌండ్‌బార్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉన్నాయి. అంతేకాదు, సినిమా హాల్‌లో సౌండ్ ఉన్నట్టు అనిపించే డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సరౌండ్ సౌండ్, 3D స్పేషియల్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్నాయి. వీటిని LG టీవీలకు కనెక్ట్ చేస్తే, సినిమా చూసే ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందంట!

* ధరలు, ఎక్కడ దొరుకుతాయ్..?
LG S95TR అసలు ధర రూ.84,990 కాగా అమెజాన్‌లో లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో భాగంగా రూ.79,988కే కొనొచ్చు. LG S90TY అసలు ధర రూ.69,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.64,990కి లభిస్తోంది. ఈ రెండు మోడల్స్‌ను LG అధికారిక వెబ్‌సైట్‌లో, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో, ఇంకా కొన్ని సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో కూడా కొనొచ్చు.

Elevate Your Home Theater Experience  LG Launches S95TR and S90TY Premium Soundbars

* LG S95TR సౌండ్‌బార్ ఫీచర్స్
ఈ సౌండ్‌బార్‌లో మొత్తం 9.1.5 ఛానెల్ సెటప్ ఉంది. అంటే 17 స్పీకర్లు ఉంటాయి. అందులో 5 పైకి సౌండ్ వచ్చే స్పీకర్లు, కొత్త రకం ట్వీటర్లు, ఇంకా అదిరిపోయే బాస్ కోసం పాసివ్ రేడియేటర్లు ఉన్నాయి. దీని పవర్ ఔపుట్ ఏకంగా 810W. బాస్ గురించి చెప్పక్కర్లేదు, 120Hz వరకు లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది.

వెనుక వైపు వైర్‌లెస్ సరౌండ్ స్పీకర్లు కూడా వస్తాయి. అంటే సౌండ్ చుట్టూ తిరుగుతూ సినిమా హాల్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది 24bit/96kHz శాంప్లింగ్‌తో హై-రెజల్యూషన్ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్, DTS:X, డాల్బీ డిజిటల్, AAC లాంటి చాలా ఆడియో ఫార్మాట్‌లు ఇందులో ప్లే అవుతాయి.

- కనెక్టివిటీ
HDMI ఇన్/ఔట్, బ్లూటూత్ 5.1, వై-ఫై, ఆప్టికల్, USB, వైర్‌లెస్ స్పీకర్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. LG WOWCAST అనే ఫీచర్ ద్వారా వైర్‌లెస్‌గా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. AI రూమ్ కాలిబ్రేషన్, అలెక్సా, ఎయిర్‌ప్లే 2, స్పాటిఫై కనెక్ట్, గూగుల్ హోమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

HDMI 4K@120Hz పాస్-త్రూ, HDR10, డాల్బీ విజన్, ARC/eARC లను సపోర్ట్ చేస్తుంది. వీటితో సౌండ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బాగా సినిమాలు చూసేవారికి ఇదే బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. సబ్‌ వూఫర్, వెనుక స్పీకర్లతో కలిపి దీని మొత్తం బరువు 26.4 కేజీలు.

* LG S90TY సౌండ్‌బార్ ఫీచర్లు
ఇది 5.1.3 ఛానెల్ సెటప్‌తో వస్తుంది. అంటే 11 స్పీకర్లు, 570W పవర్ ఔట్‌పుట్ ఉంటుంది. ఇందులో సెంటర్ అప్-ఫైరింగ్ స్పీకర్ ఉంది. ఇది డైలాగులు క్లియర్‌గా వినిపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 24bit/96kHz శాంప్లింగ్‌తో హై-రెజల్యూషన్ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్, DTS:X, డాల్బీ డిజిటల్, AAC వంటి ఆడియో ఫార్మాట్లు ఇందులోనూ ప్లే అవుతాయి.

కనెక్టివిటీ ఆప్షన్స్ S95TRలో ఉన్నట్టే ఉంటాయి. అలెక్సా, ఎయిర్‌ప్లే 2, స్పాటిఫై కనెక్ట్, గూగుల్ హోమ్ వంటి ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. HDMI 4K@120Hz పాస్-త్రూ, HDR10, డాల్బీ విజన్, ARC/eARC సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 22.2 కేజీలు (సబ్‌ వూఫర్‌తో కలిపి).

* అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ స్పెషాలిటీ
ఈ రెండు సౌండ్‌బార్లలో ఉండే 3D స్పేషియల్ సౌండ్ టెక్నాలజీ రూమ్‌కు తగ్గట్టు సౌండ్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. దీంతో సౌండ్ చాలా సహజంగా, చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే AI రూమ్ కాలిబ్రేషన్ రూమ్ అకౌస్టిక్స్‌ను బట్టి ఆడియోను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల సౌండ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది.

LG వావ్‌క్యాస్ట్ అనేది LG టీవీలకు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. HDMI కేబుల్స్ పెట్టుకునే పని ఉండదు. ఇక డాల్బీ అట్మోస్, DTS:X టెక్నాలజీలు సౌండ్‌ను మూడు డైమెన్షన్స్‌లో ఇస్తాయి. అంటే సౌండ్ చుట్టూ తిరుగుతున్నట్టు, సినిమా హాల్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది.

* LG ఇండియా డైరెక్టర్ ఏమన్నారంటే..
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ బ్రియాన్ జంగ్ మాట్లాడుతూ, "మా కొత్త సౌండ్‌బార్లు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే LG కమిట్‌మెంట్‌కు నిదర్శనం. సెంటర్ అప్-ఫైరింగ్ స్పీకర్లు, 3D స్పేషియల్ సౌండ్ టెక్నాలజీ, LG టీవీలతో వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇండియన్ కస్టమర్ల టేస్ట్‌లకు తగ్గట్టుగా ఉన్నాయి." అని అన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Elevate Your Home Theater Experience, LG Launches S95TR and S90TY Premium Soundbars in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X