అమెజాన్ ఎకోతో పోటీపడేందుకు ఫేస్ బుక్ రెడీ అంటోంది. ఇందులో భాగంగా పోర్టల్ వీడియో చాట్ డివైసును ప్రారంభించింది. ఫేస్ బుక్ 15అంగుళాల స్క్రీన్ మరియు మైక్రోఫోన్ల రేంజ్ ను కలిగి ఉన్న ఒక హోం వీడియో చాట్ డివైసును రూపొందిస్తుంది. ఫైనాన్షియల్ న్యూస్ సైట్ చెద్దార్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. పోర్టల్ అని పిలిచే డివైస్ వ్యక్తిగత ముఖాలను గుర్తించే వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈమధ్య AI-ఆధారిత స్మార్ట్ స్పీకర్లు యూజర్లను చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ నుంచి వచ్చిన ఎకో మార్కెట్ ను శాసిస్తోంది. గూగుల్ హోం ఏమాత్రం వెనబడి లేదు. ఇక యాపిల్ తన ఇండిపెండెంట్ స్మార్ట్ స్పీకర్ అయిన హోంపాడ్ ను సిరిచే సమర్పిస్తోంది.
పోర్టల్ ఫీచర్స్ చూస్తే....
రిపోర్టు ప్రకారం, పోర్టల్ 15అంగుళాల పెద్ద స్క్రీన్ తోపాటు మైక్రోఫోన్ల రేంజ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు వీడియో చాట్ డివైసులో ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీతో వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ ఫీచర్ తో...వినియోగదారుల యొక్క ఫేస్ బుక్ అకౌంట్ తో కనెక్ట్ చేసిన ఫ్రెండ్ను గుర్తిస్తుంది. అమెజాన్ ఎకో షో మాదిరిగానే ఇది యూజర్ యొక్క వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది. సంస్థ యొక్క ప్రొడక్ట్ రహస్యమైన బిల్డింగ్ 8 ప్రయోగశాల ద్వారా తయారు చేస్తున్నారు.
పోర్టల్ యొక్క లభ్యత మరియ ధర.....
పోర్టల్ యొక్క ఫీచర్స్ గురించి చర్చించినట్లుగానే...ఇతర అంశాలను పరిశీలించినట్లయితే...నెట్ ఫ్లిక్స్ మరియు SPOTIFY వంటి థర్డ్ పార్టీ యాప్స్ తో ఈ డివైసు ముందుగా లోడ్ చేయబడుతుంది. ప్రొడక్ట్ యొక్క ధరను రిపోర్టుల అంచనా వేస్తూ వెల్లడిచింది. డివైసు 499డాలర్లు అంటే (సుమారు 31,735రూపాయలు) ఖర్చు అవుతుంది.
ఈ ఏడాది మేలో జరగనున్న ఫేస్ బుక్ వార్షిక డెవలపర్ సమావేశంలో ఈ ఫోర్టల్ను ప్రకటించనుంది .అయినప్పటికీ ఇది 2018రెండవ త్రైమాసికంలో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. పోర్టల్ యొక్క ప్రయోగంతో మార్క్ జూకర్ బర్గ్ సంస్థ హార్డ్ వేర్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
జియో రిపబ్లిక్ డే ఆఫర్లు, కొత్త ప్లాన్లు అధిక డేటా, ఆఫర్ల పూర్తి వివరాలు !
ప్రీవియస్ రిపోర్ట్స్......
ఫేస్ బుక్ టచ్ స్క్రీన్ తో పనిచేసే స్మార్ట్ స్పీకర్ను రెడీ చేస్తుందని గతేడాది ఆగస్టులో డిజిటటైమ్స్ అనే రిపోర్ట్ వెల్లడించింది. ఈ పరికరం 15అంగుళాల టచ్ డిస్ ప్లేని కలిగి ఉంటుంది .ఇది ఫేస్ బుక్ యొక్క ప్రయోగాత్మక భవనంలో రూపొందిస్తుంది. అయేతే 2018 మొదటి త్రైమాసికంలో స్పీకర్ రిలీజ్ అవుతుందనే రూమర్స్ కూడా వచ్చాయి.
ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ కూడా హోం బేస్డ్ వీడియో చాట్ డివైసును తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. రిపోర్ట్ కూడా సంస్ధ యొక్క మొదటి ప్రధాన హార్డ్ వేర్ ప్రొడక్టుగా సూచించింది. అయితే తాజా రిపోర్టు ప్రకారం, ఈ డివైస్ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు, AI ఫవర్ తో ఉన్న మైక్రో ఫోన్లు మరియు స్పీకర్స్ తో వస్తున్నాయి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.