ఫేస్‌బుక్ నుంచి వీడియో కాలింగ్ డివైస్‌లు
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ పోర్టల్, పోర్టల్ ప్లస్ పేరిట రెండు నూతన వీడియో కాలింగ్ డివైస్‌లను విడుదల చేసింది.
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ పోర్టల్, పోర్టల్ ప్లస్ పేరిట రెండు నూతన వీడియో కాలింగ్ డివైస్‌లను విడుదల చేసింది. గృహ వినియోగం కోసం వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉంది. అందువల్ల వీడియో కాలింగ్ చేసుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పోర్టల్ డివైస్‌లో 10 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే (1280 * 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్) ఉండగా, పోర్టల్ ప్లస్‌లో 15 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే (1920 * 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)ను ఏర్పాటు చేశారు. వీటిల్లో స్మార్ట్ కెమెరా, స్మార్ట్ సౌండ్ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల యూజర్లు హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.

అమెజాన్, గూగుల్‌తో పోటీపడే క్రమంలో ..
స్మార్ట్ స్పీకర్ మార్కెట్లో అమెజాన్, గూగుల్‌తో పోటీపడే క్రమంలో ఫేస్‌బుక్ దీన్ని రూపొందించింది. ప్రత్యేకంగా స్క్రీన్ ముందరే నిల్చోవాల్సిన అవసరం లేకుండా 'హేయ్ పోర్టల్' అని పలకరించడం ద్వారా దీన్నుంచి కాల్ ప్రక్రియ ప్రారంభించవచ్చు.

స్మార్ట్ సౌండ్ టెక్నాలజీ వల్ల ..
ఫేస్‌బుక్ పోర్టల్ డివైస్‌లలో ఉన్న స్మార్ట్ సౌండ్ టెక్నాలజీ వల్ల యూజర్లు అవతలి వ్యక్తులతో కాల్స్ మాట్లాడేటప్పుడు వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే శబ్దాలు పూర్తిగా తగ్గుతాయి.

మెసెంజర్ ద్వారా కాల్స్ ..
దీని వల్ల అవతలి వారి వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే అవతలి వ్యక్తులకు పోర్టల్ డివైస్ లేకపోయినప్పటికీ మెసెంజర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఒకేసారి 7 మందితో గ్రూప్ కాల్స్ చేసుకుని మాట్లాడవచ్చు.

మధ్యలో కావాలనుకుంటే..
కాల్ చేస్తుండగా మధ్యలో కావాలనుకుంటే కెమెరా ఆటోమేటిక్‌గా జూమ్ అవుట్ అయి మనతో పాటు మరో వ్యక్తిని కూడా వీడియో కాల్‌లో చూపిస్తుం ది. అలాగే కాలర్ అటూ, ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నా వారినే ఫాలో అవడం, వారి మాటల్ని మాత్రమే గుర్తించడం తదితర ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

అమెజాన అలెక్సా డిజిటల్ అసిస్టెంట్‌ను..
పోర్టల్ డివైస్‌లలో అమెజాన అలెక్సా డిజిటల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల యూజర్లు వాయిస్ కమాండ్లతో డివైస్ ద్వారా క్రీడావార్తలు, వాతావరణ విశేషాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

వ్యక్తిగత ప్రైవసీ, భద్రతకు..
పోర్టల్‌తో వ్యక్తిగత ప్రైవసీ, భద్రతకు ముప్పేమీ ఉండబోదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. కెమెరాను కవర్ చేసేయొచ్చని, లెన్స్.. మైక్రోఫోన్‌ను డిజేబుల్ కూడా చేయొచ్చ ని వివరించింది.

కెమెరా, మైక్రోఫోన్‌లను..
యూజర్లు తమకు అవసరం లేదనుకుంటే కెమెరా, మైక్రోఫోన్‌లను డిజేబుల్ చేసుకోవచ్చు.పోర్టల్ డివైస్‌లకు లాక్ పెట్టుకునే సదుపాయం కల్పించారు.

12 డిజిట్ల పాస్‌కోడ్‌ను..
12 డిజిట్ల పాస్‌కోడ్‌ను వీటికి సెట్ చేసుకుంటే డివైస్‌లు సురక్షితంగా ఉంటాయి. ఇక ఈ రెండు డివైస్‌లను నవంబర్ నుంచి విక్రయించనున్నారు. ముందుగా అమెరికా మార్కె ట్లో ప్రీ-ఆర్డర్‌లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ధర
అమెజాన్, ఫేస్‌బుక్, బెస్ట్ బై సైట్లలో ఈ డివైస్‌లు లభిస్తాయి. పోర్టల్ డివైస్ ధర రూ.14,717 ఉండగా, పోర్టల్ ప్లస్ ధర రూ.25,810 గా ఉంది. ఇక రెండింటినీ ఒకేసారి కలిపి కొనుగోలు చేస్తే రూ.22,045 మాత్రమే అవుతుంది.


Click it and Unblock the Notifications








