హైక్వాలిటీ వీడియో చాటింగ్ కోసం ఫేస్‌బుక్ పోర్టల్..
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, రెండు సరికొత్త వీడియో కాలింగ్ డివైస్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. పోర్టల్, పోర్టల్ ప్లస్ పేర్లతో ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ స్పీకర్ డివైసెస్ అందుబాటులో ఉంటాయి.
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, రెండు సరికొత్త వీడియో కాలింగ్ డివైస్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. పోర్టల్, పోర్టల్ ప్లస్ పేర్లతో ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ స్పీకర్ డివైసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ యూజర్స్ వీడియో చాటింగ్‌ను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆఫర్ చేస్తుంది.

వాయిస్ కంట్రోల్స్ ఆధారంగా కాల్స్ నిర్వహించుకోవచ్చు..
అమెజాన్ అలెక్సా సపోర్ట్‌తో వస్తోన్న ఈ రెండు డివైసెస్‌ను వాయిస్ కంట్రోల్స్ ఆధారంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ డివైస్‌లోని మెసెంజర్ యాప్ ద్వారా మీరు రవి అనే వ్యక్తకి కాల్ చేయాలనుకుంటున్నట్లయితే వాయిస్ కమాండ్స్ ద్వారా "Hey Portal, call Ravi " అని డివైస్‌కు చెబితే సరిపోతుంది.

టాబ్లెట్స్ తరహాలో పెద్దపెద్ద డిస్‌ప్లేలతో...
ఈ రెండు డివైసెస్ టాబ్లెట్స్ తరహాలో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ అయిన పోర్టల్ 10 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 199 డాలర్లు. ఇక రెండవ మోడల్ అయిన పోర్టల్ ప్లస్ 15 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 349 డాలర్లు. ఇండియన్ మార్కెట్లో వీటి అందుబాటుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

స్పాటిఫై, పాండోరా వంటి ఇన్‌బిల్ట్ యాప్స్...
ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో స్పాటిఫై, పాండోరా, ఐహార్ట్‌రేడియో, ఫేస్‌బుక్ వాచ్, ఫుడ్ నెట్‌వర్క్, స్ర్కిప్స్ న్యూసీ వంటి సర్వీసెస్ ముందస్తుగానే లోడై ఉంటాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మరిన్ని సర్వీసులను ఇందులో యాడ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ ఆప్షన్స్ ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో మిస్ అయ్యాయి.

కాలింగ్ సమయంలో స్నాప్‌చాట్ తరహా ఎఫెక్ట్స్..
ఈ డివైసెస్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నపుడు స్నాప్‌చాట్ తరహా ఎఫెక్ట్స్‌ను అద్దుకునే వీలుంటుంది. ఇదే సమయంలో డివైసైస్‌లోని స్పాటిఫై, ఐహార్డ్ రేడియో, పాండోరా వంటి ఇన్‌బిల్ట్ ఫీచర్స్‌ను ఉపయోగించుకుని మ్యూజిక్‌ను షేర్ చేసకునే వీలుంటుంది. పోర్టల్ డివైస్‌లో లోడ్ చేసిన స్టోరీ టైమ్ ఫీచర్ ద్వారా మంచి మంచి ఈ-బుక్స్‌ను చదువుకునే వీలుంటుంది.

అమెజాన్ అలానే గూగుల్ నుంచి గట్టి పోటీ..
ఫేస్‌బుక్ లాంచ్ చేసిన స్మార్ట్ స్సీకర్స్‌కు అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ బ్రాండ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. అమెరికా స్మార్ట్ స్పీకర్స్ మార్కెట్లో ఇప్పటికే ఈ రెండు బ్రాండ్స్ విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్‌ను సెక్యూరిటీ పరమైన సమస్యలు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇన్ని అవరోధాలు, అడ్డంకులను ఎదుర్కొని ఫేస్‌బుక్ పోర్టల్స్ ఏ విధంగా ముందుకు వెళతాయో వేచి చూడాల్సి ఉంది.

అమెజాన్ Alexa ప్రత్యేకతలు
అమెజాన్ తన స్మార్ట్ స్పీకర్స్‌లో పొందుపరస్తున్న Alexa వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్, మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్‌ను బట్టి స్పీకర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఈ స్పీకర్స్‌తో ఆడియో బుక్స్‌ను వినొచ్చు. అందులో మనుకు అవసరమైన చాప్టర్ పేరును చెబితే చాలు, ఆ చాప్టర్‌ను స్పీకర్ మనకు చదివి వినిపిస్తుంది. ఈ స్పీకర్స్ మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటంతో పాటు కావల్సిన మ్యూజిక్‌ను ప్లే చేయటం, న్యూస్‌ను చదవి వినిపించటం, క్రికెట్ స్కోర్ చెప్పటం, క్యాలెండర్ చెక్ చేసి పెట్టడం, అలారమ్ సెట్ చేయటం, ఇంట్లోని లైట్‌లను కంట్రోల్ చేయటం, ఇలా చాలా చాలా పనులను చక్కబెట్టేస్తాయి.


Click it and Unblock the Notifications








