రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలు! టాప్ బ్రాండ్ల...లిస్ట్ చూడండి.

By Maheswara
|

ప్రస్తుతం, భారతదేశంలో 55-అంగుళాల మరియు 43-అంగుళాల స్మార్ట్ టీవీల కంటే 32-అంగుళాల స్మార్ట్ టీవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా చెప్పాలంటే చాలా కంపెనీలు బడ్జెట్ ధరలలో అద్భుతమైన 32-అంగుళాల స్మార్ట్ టీవీలను విడుదల చేస్తున్నాయి.

 

32 అంగుళాల స్మార్ట్ టీవీలు

అలాగే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న 32 అంగుళాల స్మార్ట్ టీవీలు ప్రత్యేకమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, నాణ్యమైన ఆడియో సౌకర్యం, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సదుపాయం వంటి అనేక ప్రత్యేకతలతో వస్తున్నాయనే చెప్పాలి. కాబట్టి భారతదేశంలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన 32-అంగుళాల స్మార్ట్ టీవీల లిస్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము.

32-అంగుళాల శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ

32-అంగుళాల శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ

32-అంగుళాల శామ్‌సంగ్ వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ అమెజాన్‌లో రూ.13,490కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ Samsung Smart TV 1366x768 పిక్సెల్‌లు మరియు 60 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. మరియు ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీలో పర్సనల్ కంప్యూటర్, స్క్రీన్ షేర్, మ్యూజిక్ సిస్టమ్, కనెక్ట్ షేర్ మూవీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

32-అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ ఫీచర్లు
 

32-అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ ఫీచర్లు

ఈ అద్భుతమైన Samsung Smart TV డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 20 వాట్ స్పీకర్లతో వస్తుంది. మరియు ఈ Samsung Smart TV , Android TV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ సహా వివిధ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.

Xiaomi 32-అంగుళాల స్మార్ట్ టీవీ

Xiaomi 32-అంగుళాల స్మార్ట్ టీవీ

Xiaomi 32-అంగుళాల (5A సిరీస్ HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV) TV మోడల్‌ను Amazonలో ప్రస్తుతం రూ.12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో 1366 x 768 పిక్సెల్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉన్నాయి. అలాగే ఈ Xiaomi Smart TV మోడల్‌లో Android TV 11 ఆపరేటింగ్ సిస్టమ్, 20 వాట్స్ స్పీకర్లు, ప్యాచ్‌వాల్, 1GB RAM, 8GB స్టోరేజ్, quad-core Cortex A35 ప్రాసెసర్, Wi-Fi, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్, USB పోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

OnePlus Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ

OnePlus Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ

32-అంగుళాల Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ అమెజాన్‌లో ప్రస్తుతం  రూ.11,999కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించబడింది. మరియు శక్తివంతమైన 64-బిట్ ప్రాసెసర్‌తో, ఈ 32-అంగుళాల OnePlus స్మార్ట్ టీవీని ఉపయోగించడం మీకు ఆనందంగా ఉంది. మరియు ఈ సరికొత్త OnePlus స్మార్ట్ టీవీలో 20 వాట్స్ స్పీకర్లు, బెజెల్-లెస్ డిజైన్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

32-అంగుళాల Redmi Android 11 సిరీస్ HD రెడీ స్మార్ట్ TV3

32-అంగుళాల Redmi Android 11 సిరీస్ HD రెడీ స్మార్ట్ TV3

32-అంగుళాల రెడ్‌మి ఆండ్రాయిడ్ 11 సిరీస్ HD స్మార్ట్ టీవీ మోడల్ అమెజాన్‌లో రూ. 10,999కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో 20 వాట్స్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్, క్వాడ్-కోడ్ ప్రాసెసర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే వివిడ్ పిక్చర్ ఇంజిన్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, హెచ్‌డీఎంఐ పోర్ట్, యూఎస్‌బీ పోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ రెడ్‌మీ స్మార్ట్ టీవీ మోడల్ వచ్చింది.

LG 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV (32LM563BPTC)

LG 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV (32LM563BPTC)

LG 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV మోడల్‌ను అమెజాన్‌లో రూ. 12,980 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ LG TV వెబ్ OS పై రన్ అవుతుంది. అలాగే ఈ LG TVలో 10 వాట్స్ స్పీకర్లు, HDMI పోర్ట్, USB పోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.ఈ LG 32-అంగుళాల స్మార్ట్ TV మోడల్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు Wi-Fi మద్దతుతో సహా అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్ టీవీ డిజైన్ చాలా బాగుంది.

Best Mobiles in India

English summary
Festival Season Sales, Top 5 Best 32inch Smart Tvs To Buy In India Priced Under Rs.15000. List Is Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X