మార్కెట్లోకి FIIL ఆడియో ఉత్పత్తులు

Posted By: BOMMU SIVANJANEYULU

ఐఎఫ్ డిజైన్, రెడ్ డాట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ కంపెనీ ఫిల్ (FIIL) సరికొత్త ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, అడ్జస్టబల్ సౌండ్ ప్రొఫైల్స్ వంటి విప్లవాత్మక స్పెక్స్ ఈ బ్లుటూత్ హెడ్‌ఫోన్‌లలో ఉన్నాయి.

మార్కెట్లోకి FIIL ఆడియో ఉత్పత్తులు

ఫిల్ వైర్‌లెస్ క్యాన్స్ ప్రత్యేకమైన ప్లెయిన్ సర్కిల్స్‌ను కలిగి ఉంటాయి. బ్యాండ్ మరింత మందంగా ఉంటుంది. ఇయర్ కప్స్‌కు సంబంధించిన బయట భాగాన్ని అల్యూమినియమ్ మెటల్‌తో డిజైన్ చేసారు. హెడ్‌బ్యాండ్ భాగాన్ని ప్లాస్టిక్‌తో రూపొందించారు. లెదర్ కవర్ ఫోమ్‌తో కప్పి ఉంచిన ఇయర్ ప్యాడ్స్ సౌకర్యవంతమైన ఫీల్‌ను కలగజేస్తాయి.

వాల్యుమ్ అలానే ట్రాక్ స్కిప్పింగ్ కోసం ప్రత్యేకమైన కెపాసిటివ్ కంట్రోల్స్ ఈ హెడ్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కుడిచేతి వైపు ఇయర్‌కప్ టచ్ సెన్సిటివ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. లెఫ్ట్ కప్ భాగంలో మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు ఎన్ఎఫ్‌సీ యాంటెన్నాలు ఉంటాయి. పాసివ్ లిస్టన్నింగ్ కోసం 3.5 ఎమ్ఎమ్ జాక్‌ను కూడా ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచారు.

మార్కెట్లోకి FIIL ఆడియో ఉత్పత్తులు

ఈ హెడ్‌ఫోన్‌లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ రేంజ్ 15 Hz నుంచి 22,000 kHz మధ్య ఉంటుంది. శక్తివంతమైన 40ఎమ్ఎమ్ డ్రైవర్స్‌ను ఈ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లలో చూడొచ్చు. హై-ఫైడలిటీ డిజిటల్ సౌండ్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ హెడ్‌ఫోన్‌లు బెస్ట్ క్వాలిటీ బ్లుటూత్‌ను అందించే విధంగా aptX, AAC వంటి కోడిక్స్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఫోన్ లాక్ అయ్యిందా? ఓపెన్ చేయడం సింపుల్!

ఈ హెడ్‌ఫోన్‌లలో యాంబియంట్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని ఆన్ చేసుకున్నట్లయితే 33 గంటల ప్లేబ్యాక్‌ను ఆస్వాదించే వీలుటుంది. యాంబియంట్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని ఆఫ్ చేసుకున్నట్లయితే 27 గంటల ప్లేబ్యాక్ మాత్రమే లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఓఎస్ ఆధారిత డివైస్‌లతో కూడ ఈ హెడ్‌ఫోన్‌లను పెయిర్ చేసుకోవచ్చు.

సంవత్సరం వారంటీతో లభ్యమవుతోన్న ఈ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియాతో పాటు పేటీఎమ్ మాల్‌లు విక్రయిస్తున్నాయి. ధర రూ.17,499. రెడ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

English summary
Fiil, a designer and manufacturer of finely crafted, leading-edge audio products, today launched Fiil Wireless Over-Ear Headphones in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot