Fire boltt నుంచి కొత్త స్మార్ట్‌వాచ్.. జులై 6 నుంచి అందుబాటులోకి..!!
ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ నుంచి కొత్త వాచ్ అందుబాటులోకి రానుంది. ఫైర్ బోల్ట్ కంబాట్ పేరుతో రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.95 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ సహా ఆరోగ్యానికి సంబంధించిన అనేక ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. హెర్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ సహా మరెన్నో అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ వాచ్ వందకిపైగా క్లౌడ్ బేస్ ఫేస్‌లు మరియు 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఫైర్ బోల్ట్ కంబాట్ స్మార్ట్‌వాచ్ దీర్ఘచతురస్రాకార (Rectangle) డయల్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్ షాక్, స్క్రాచ్, వాటర్ రెసిస్టెంట్ అని సంస్థ వెల్లడించింది.

ఫైర్ బోల్ట్ కాంబాట్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో జులై 6 నుంచి అందుబాటులో ఉండనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.1799కు కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ నాలుగు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. బ్లాక్, గ్రీన్, కామో బ్లాక్, కామో గ్రీన్ రంగుల్లో ఫైర్ బోల్ట్ కంబాట్ లభిస్తుంది.
ఫైర్ బోల్ట్ కంబాట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో రానుంది. స్మార్ట్‌వాచ్ నుంచే వినియోగదారులు కాల్ చేసుకోవచ్చు మరియు వచ్చిన కాల్స్‌ను స్వీకరించవచ్చు. మరో కీలక ఫీచర్‌ను ఈ వాచ్ కలిగి ఉంది. గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ సిరి తరహాలోనే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ అసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది. వాయిస్ కమాండ్ సాయంతో అలారం లేదా రిమైండర్ పెట్టుకోవచ్చు.
వీటితో పాటు ఈ వాచ్ అనేక హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. SpO2 మానిటరింగ్, హెర్ట్ రేట్ ట్రాకింగ్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకర్, హైడ్రేషన్ ట్రాకర్, స్లీప్ మానిటర్ సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. మరియు వాటర్, డస్ట్ రేటింగ్‌లో IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

ఫైర్ బోల్ట్ కంబాట్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సాధారణ వినియోగానికి 8 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ తెలిపింది. అదే బ్లూటూత్ కాలింగ్‌ను ఫీచర్‌ను వినియోగిస్తే 5 రోజులపాటు ఛార్జింగ్ వస్తుందని పేర్కొంది. ఎటువంటి వినియోగం లేకుంటే 25 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ తెలిపింది.
మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ కెమెరా కంట్రోల్, అలారం, టైమర్, స్టాప్ వాచ్, వాతావరణానికి సంబంధించిన వివరాలు వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు రెండు బటన్లతో వస్తుంది. ఈ వాచ్‌ను జులై 6 నుంచి అందుబాటులోకి వస్తుంది. కేవలం రూ.1,799లకు కొనుగోలు చేయవచ్చు.
గత కొంతకాలంగా చాలా మంది స్మార్ట్ వాచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. స్టైలిష్ లుక్ సహా ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకర్లు కూడా ఈ వినియోగం పెరగడానికి కారణం. ఇటీవల స్మార్ట్‌వాచ్‌ల్లో ఉన్న ఫీచర్లు వినియోగదారుల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రోజువారీ తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు కొందరు స్మార్ట్‌వాచ్‌లోని హెల్ట్ ట్రాకర్ల్‌పై ఆధారపడుతుంటారు.


Click it and Unblock the Notifications








