Home
Gadgets

ధర రూ.799 కే, 40 గంటల బ్యాటరీ తో కొత్త ఇయర్‌బడ్‌లు! వివరాలు

By Maheswara

ఫైర్ బోల్ట్ సంస్థ ఇటీవల FirePods Ares ను లాంచ్ చేసింది. ఇది FirePods సిరీస్ లో వచ్చిన TWS ఇయర్‌బడ్‌లకు సరికొత్త జోడింపు. ఇది గత నెలలో ఫైర్ పాడ్స్ Aura విడుదలైన తర్వాత రావడం గమనించదగిన విషయం.

ఈ FirePods Ares ఇయర్‌బడ్‌లు 13mm డైనమిక్ డ్రైవర్‌లతో ఓపెన్-ఫిట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. మరియు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో అమర్చబడి ఉంటాయి. ఇవి కాల్‌ల సమయంలో బయటి శబ్దాన్ని సమర్థవంతంగా తొలగిస్తాయి మరియు స్పష్టమైన కమ్యూనికేషన్‌ను అందిస్తాయి.

Fire-Boltt FirePods Ares TWS Earbuds Launched In India, With 40Hours Battery. Price And Specifications Details.

FirePods Ares ఇయర్‌బడ్‌లలో, వినియోగదారులు ఫైర్‌ఛార్జ్ టెక్నాలజీతో పాటుగా 40 గంటల పాటు ప్లే టైమ్‌ను పొందవచ్చు. ఇది టైప్ C పోర్ట్ ద్వారా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 100 నిమిషాల ప్లే టైమ్‌ను అందిస్తుంది. ఈ TWS ఇయర్‌బడ్‌ల యొక్క ఇతర లక్షణాలలో 40ms తక్కువ-లేటెన్సీ గేమింగ్ మోడ్, బ్లూటూత్ v5.3 మరియు IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఇయర్‌బడ్‌లు తక్కువ బడ్జెట్‌ ధర తో కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. అయినప్పటికీ, ధర తక్కువే అయినప్పటికీ మంచి ఫీచర్‌లను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్‌ ల యొక్క ధర మరియు సేల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఫైర్ బోల్ట్ FirePods Ares ఇయర్‌బడ్‌ల ధర & లభ్యత వివరాలు
ఈ ఇయర్‌బడ్‌ల ధర కేవలం రూ. 799 గా లాంచ్ అయింది. ఇంకా, ఇవి బ్లూ, బ్లాక్, పింక్ మరియు వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. మీరు వీటిని Fire-Boltt.com లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఫైర్-బోల్ట్ FirePods Ares స్పెసిఫికేషన్ల వివరాలు
ఫైర్-బోల్ట్ FirePods Ares ఇయర్‌బడ్ లు సాధారణ ప్యాకేజీలో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తాయి. ఈ ఫీచర్లలో, 13mm సౌండ్ డ్రైవర్‌లలు ముఖ్యమైనవి. ఇవి, మంచి ఆడియో నాణ్యతను అందిస్తాయి. ఇంకా, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది, ఇది కాల్‌ల సమయంలో మీ మైక్ నుండి వచ్చే నాయిస్‌ను తగ్గించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. లాగ్-ఫ్రీ ఆడియో కోసం గేమర్‌లు 40ms తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను అభినందిస్తారు. ఇంకా, మ్యూజిక్ మరియు కాల్‌లను ఇబ్బంది లేకుండా వాడటానికి ఉపయోగపడే స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ను కూడా కలిగి ఉంది.

ఈ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ వెర్షన్ 5.3పై పనిచేస్తాయి మరియు కనెక్టివిటీ కోసం సూపర్‌సింక్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. మీరు FirePods Ares ఇయర్‌బడ్‌ల ద్వారా మీ ఫోన్‌లోని AI వాయిస్ అసిస్టెంట్‌ని యాక్సెస్ చేయవచ్చు మరియు బోల్ట్ ప్లే యాప్‌ తో ఇయర్‌బడ్‌లను నియంత్రించే ఆప్షన్ ను కూడా మీరు కలిగి ఉంటారు.

వీటి బ్యాటరీ లైఫ్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మొత్తం మీద కేస్ తో కలిపి 40 గంటలు మరియు ఇయర్‌బడ్స్‌ మాత్రమే 7 గంటలు బ్యాటరీ ని అందిస్తాయి. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ తో మీకు 100 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది.

ఇంకా, ఫైర్-బోల్ట్ సంస్థ నుంచి ఇటీవల తన అపోలో 3 స్మార్ట్‌వాచ్‌ను కూడా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ మెటల్ బిల్డ్, అమోలెడ్ డిస్‌ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్‌తో లాంచ్ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Fire-Boltt FirePods Ares TWS Earbuds Launched In India, With 40Hours Battery. Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X