Fitbit కంపెనీ నుంచి 3 కొత్త వేర‌బుల్స్ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షాకే!

|

Fitbit కంపెనీ గ్లోబ‌ల్ మార్కెట్లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మూడు స‌రికొత్త మోడ‌ల్ వేర‌బుల్స్‌ను విడుద‌ల చేసింది. Fitbit Sense 2, Versa 4, Inspire 3 పేర్ల‌తో ఈ ఫిట్‌నెస్ వేరబుల్స్ గ్లోబ‌ల్‌గా లాంచ్ చేయబడ్డాయి, ఈ వేర‌బుల్స్ క‌ల‌ర్ డిస్‌ప్లేతో పాటుగా, ట‌చ్‌స్క్రీన్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి. గ‌తంలో Fitbit కంపెనీ విడుద‌లైన మోడ‌ల్స్ మాదిరిగానే, కొత్త డివైజ్‌లు ఆరోగ్యాన్ని కాపాడేలా ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్నాయి.

fitbit

Fitbit Sense 2 స్మార్ట్‌వాచ్ ECG యాప్ మరియు PPG అల్గారిథమ్‌తో వస్తుంది. ఇది హార్ట్ ఎటాక్ వంటి గుండె సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. మ‌రోవైపు, Fitbit Versa 4 స్మార్ట్‌వాచ్ 40 కంటే ఎక్కువ ఎక్స‌ర్‌సైజ్‌ మోడ్‌లను క‌లిగి ఉంది. సెన్స్ 2 మరియు వెర్సా 4 రెండూ గరిష్టంగా 6 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే Fitbit యొక్క ఎంట్రీ-లెవల్ ట్రాకర్ Inspire 3 మాత్రం 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని పేర్కొంది.

Fitbit Sense 2, Versa 4, Inspire 3 ధ‌ర‌లు, ల‌భ్య‌త‌:
Fitbit Sense 2 ధర USలో $299.95 (భార‌త్‌లో దాదాపు రూ.23,900)గా నిర్ణయించబడింది. Fitbit Versa 4 ధర $229.95 (దాదాపు రూ.18,300) గా నిర్ణ‌యించారు. ఇక‌పోతే, Inspire 3 ధ‌ర‌ను $99.95 (దాదాపు రూ.7,900) గా నిర్ణ‌యించారు. కొత్త మూడు మోడల్‌లు ఆరు నెలల పాటు ఉచిత ఫిట్‌బిట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి.

మూడు వేర‌బుల్స్ USలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. Inspire 3 మాత్రం గ్లోబ‌ల్‌గా వినియోగ‌దారుల‌కు సెప్టెంబ‌ర్ నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. Fitbit Sense 2, Versa 4 లు భార‌త్ సహా అన్ని గ్లోబల్ మార్కెట్‌ల‌లో త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయి.

fitbit

Fitbit Sense 2, Versa 4 స్మార్ట్ వాచ్‌ల ప్ర‌త్యేక‌త‌లు:
Fitbit Sense 2, Versa 4 రెండూ iOS మరియు Android మొబైల్స్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు త్వరలో గూగుల్ మ్యాప్స్ మరియు గూగుల్ వాలెట్‌తో కూడా అనుకూలంగా ప‌ని చేస్తాయి. ఇంకా, వీటిలో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఫీచ‌ర్ ఉంది. ఇది యూజ‌ర్ల‌ను నేరుగా డివైజ్‌నుంచే వాయిస్ కాల్‌లు చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు 50 మీటర్ల వరకు వాట‌ర్ రెసిస్టాన్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. రెండు మోడళ్లలో ఇన్‌బిల్ట్ GPS మరియు నావిగేషన్ కోసం సైడ్-మౌంటెడ్ బటన్ ఉంటుంది.

Fitbit Sense 2 స్పెసిఫికేష‌న్లు:
Fitbit Sense 2 కొత్త Fitbit OS ద్వారా ర‌న్ అవుతూ.. 100 కంటే ఎక్కువ వాచ్‌ఫేస్‌లను అందిస్తుంది. ఇది వాయిస్ కమాండ్‌ల కంట్రోలింగ్ అమెజాన్ అలెక్సా ఇన్‌బిల్ట్ స‌పోర్ట్ తో వస్తుంది. అంతేకాకుండా, స్మార్ట్ వాచ్ యొక్క డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా ఆల్వేస్ ఆన్ మోడ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. హృదయ స్పందన రేటు, మరియు నిరంతర ఎలక్ట్రోడెర్మల్ యాక్టివిటీ (cEDA)ని ట్రాక్ చేయడానికి సెన్స్ 2 కొత్త బాడీ రెస్పాన్స్ సెన్సార్‌తో వస్తుంది.

యూజ‌ర్ల‌కు హార్ట్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను క‌నుగొనేందుకు Sense 2 లో ఈసీజీ యాప్ ఫెసిలిటీని క‌ల్పిస్తున్నారు. ఇది (SpO2) బ్ల‌డ్‌ ఆక్సిజన్ మానిటర్‌ను కలిగి ఉంటుంది. కొత్త స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్ మరియు స్టెప్స్ కౌంట్‌కు సంబంధించిన ఫీచ‌ర్ల‌ను కూడా క‌లిగి ఉంది.

fitbit

Fitbit Versa 4 స్పెసిఫికేష‌న్లు:
Fitbit Versa 4 అమెజాన్ అలెక్సా మద్దతును కూడా కలిగి ఉంది. ఇది HIIT, వెయిట్ లిఫ్టింగ్, క్రాస్ ఫిట్ మరియు డ్యాన్స్‌తో సహా 40 కంటే ఎక్కువ వ్యాయామ మోడ్‌లను అందిస్తుంది. ఇది ఫిట్‌నెస్ ఔత్సాహికులు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. 24/7 హార్ట్ మానిట‌రింగ్ అందిస్తుంది. మరియు బ్ల‌డ్ ఆక్సిజన్ (SpO2) మానిటర్‌ను కలిగి ఉంటుంది. ఫిట్‌బిట్ వెర్సా 4 స్లీప్‌ ట్రాకింగ్ మరియు ప్రెజ‌ర్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది.

Fitbit Inspire 3 స్పెసిఫికేష‌న్లు:
Fitbit Inspire 2 కు స‌క్సెస‌ర్‌గా ఈ Fitbit Inspire 3 ఫిట్‌నెస్ బ్యాండ్ ను ప‌రిచ‌యం చేసింది. తాజాగా, ప్రకటించిన మూడు కొత్త ఉత్పత్తులలో అత్యంత సరసమైన ఫిట్‌నెస్ బ్యాండ్ ఇది. ఇన్‌స్పైర్ 3 హార్ట్ రేట్ సెన్సార్, యాక్టివిటీ మానిటర్‌లతో వస్తుంది. ఇది బ్యాటరీ లైఫ్ 10 రోజుల వరకు ఉంటుంది. ఫిట్‌నెస్ బ్యాండ్ యొక్క కలర్ డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. Fitbit ఇన్‌స్పైర్ 3 Fitbit ప్రీమియమ్‌కు ఉచిత ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Fitbit Sense 2, Versa 4, Inspire 3 Fitness Wearables Launched With Colour Displays, Bluetooth Calling: Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X