15 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో ‘Fitshot Axis’ స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

|

ప్ర‌ముఖ స్మార్ట్ వేర‌బుల్స్ బ్రాండ్ Fitshot.. భార‌త్‌లో గొప్ప ఫీచ‌ర్ల‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. 'Fitshot Axis' పేరుతో ఈ స్మార్ట్‌వాచ్ భార‌త మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్‌వాచ్‌లో డిజిటల్ కంపాస్, హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఉన్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాకుండా, 125కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లు, SpO2, హార్ట్ రేట్ మరియు VO2 మాక్స్ మానిటరింగ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా, ఈ వాచ్ సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను అందిస్తుంది. అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో ‘Fitshot Axis’ స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

కాల్ రిమైండర్, షెడ్యూల్ రిమైండర్, అప్లికేషన్ పుష్ రిమైండర్, అలారం క్లాక్, సెడెంటరీ రిమైండర్ మొదలైన ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. ఈ వేరబుల్‌ సోషల్ మీడియా నోటిఫికేషన్‌లకు కూడా ఇస్తుంది. వినియోగదారులు టెక్స్ట్ లేదా ఫోన్ కాల్ అందుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను కూడా పంపుతుంది. Zeroner యాప్ ద్వారా Android మరియు iOS రెండింటితో స్మార్ట్‌వాచ్ ను పెయిర్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ వాచ్ 365 రోజుల వారంటీ క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

Fitshot Axis ధ‌ర‌:
ఈ Fitshot Axis స్మార్ట్ వాచ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.4990/- ప్రత్యేక ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొంది. దీనికి ఏడాది పాటు వారంటీ ఇస్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

Fitshot Axis స్మార్ట్‌వాచ్ ఫీచ‌ర్లు:
Fitshot Axis స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. కాస్మిక్ డిస్‌ప్లే TMతో 1.52-అంగుళాల పూర్తి టచ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డిజైన్ విష‌యానికొస్తే.. స్క్వేర్ డిస్‌ప్లేతో స్పోర్టీ-స్మార్ట్ లుక్ డిజైన్ క‌లిగి ఉంది. 450 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 240*283 పిక్సెల్‌ల రిజ‌ల్యూష‌న్‌తో, స్మార్ట్‌వాచ్ వినియోగదారుని అద్భుతమైన డిస్‌ప్లేతో గొప్ప వీక్ష‌ణ అనుభూతిని క‌ల్పిస్తుంది. స్మార్ట్ వాచ్ అధిక నాణ్యత ఫ్రేమ్‌తో ధృడమైన బాడీతో వస్తుంది.

15 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో ‘Fitshot Axis’ స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

15 రోజుల బ్యాట‌రీ లైఫ్‌:
వాట‌ర్ మ‌రియు డ‌స్ట్ రెసిస్టాన్స్ కోసం ఈ స్మార్ట్‌వాచ్‌లో 5ATM రేటింగ్ క‌ల్పించారు. Fitshot Axis ఇన్‌బిల్ట్ జీపీఎస్ సిస్ట‌మ్‌తో వస్తుంది.ఇది రూట్ మ్యాప్‌ను వీక్షించడానికి మరియు దిక్కుల‌ను తెలుసుకోవ‌డానికి ఇన్‌బిల్ట్ కంపాస్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో డిజిటల్ కంపాస్, హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఉన్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాకుండా, 125కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లు, SpO2, హార్ట్ రేట్ మరియు VO2 మాక్స్ మానిటరింగ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా, ఈ వాచ్ సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను అందిస్తుంది. అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. FitShot యాక్సిస్ 24/7 హృదయ స్పందన పర్యవేక్షణ, గుండె ఆరోగ్య పర్యవేక్షణ, ఒత్తిడి మానిటర్‌తో గుండె ఆరోగ్య పర్యవేక్షణ మరియు మరిన్నింటిని అందించే ఆప్టికల్ HR సెన్సార్‌తో త‌యారు చేశారు. స్మార్ట్ వాచ్ SpO2, VO2 మ్యాక్స్, పెడోమీటర్లు, క్యాలరీ ట్రాకర్లు మరియు మరిన్నింటితో సహా అనేక రకాల ఆరోగ్య ఫీచర్లతో వస్తుంది.

కాల్ రిమైండర్, షెడ్యూల్ రిమైండర్, అప్లికేషన్ పుష్ రిమైండర్, అలారం క్లాక్, సెడెంటరీ రిమైండర్ మొదలైన ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. ఈ వేరబుల్‌ సోషల్ మీడియా నోటిఫికేషన్‌లకు కూడా ఇస్తుంది. వినియోగదారులు టెక్స్ట్ లేదా ఫోన్ కాల్ అందుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను కూడా పంపుతుంది. Zeroner యాప్ ద్వారా Android మరియు iOS రెండింటితో స్మార్ట్‌వాచ్ ను పెయిర్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ వాచ్ 365 రోజుల వారంటీ క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
‘Fitshot Axis’ new smartwatch launched in india with 15day battery life.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X