Home
Gadgets

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ 2024.. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా రూ.8499 కే ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 2 ను ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో (Flipkart Big Saving Days Sale 2024) భాగంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఎయిర్‌పాడ్స్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌పాడ్స్‌ 2 సాధారణ ధర రూ.12,990 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ 2024 సేల్‌లో భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ జెన్‌ 2 ను (Apple Airpods 2 Price Drop) రూ.8,499 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1750 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఫలితంగా క్యాష్‌బ్యాక్‌ లేదా కూపన్లను పొందవచ్చు.

Flipkart big saving days sale 2024 offers on apple airpods 2

ఈ ఎయిర్‌పాడ్స్‌ 2.. సంవత్సర కాలం పాటు వారంటీని పొందుతాయి. దీంతోపాటు రూ.999 కే ప్రాటెక్ట్‌ + సహా ఆపిల్‌ కేర్‌ సర్వీసులను పొందవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా ప్రపంచంలోని సుమారు అన్ని పెద్ద నగరాల్లో కేవలం ఒక్కరోజులోనే సర్వీస్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్‌ (Apple Airpods 2 ) డ్యూయల్‌ బీమ్‌, ఫార్మింగ్‌ మైక్రో ఫోన్లు, డ్యూయల్‌ ఆప్టికల్‌ సెన్సార్లు, మోషన్‌ డిటెక్టింగ్‌ యాక్సిలిరోమీటర్‌, స్పీచ్‌ డిటెక్టింగ్‌ యాక్సిలిరోమీటర్‌ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు H1 హెడ్‌ఫోన్ చిప్‌ను కలిగి ఉంటుంది.

Flipkart big saving days sale 2024 offers on apple airpods 2

దీంతోపాటు ఈ ఎయిర్‌పాడ్స్‌ అనేక కంట్రోల్స్‌ను కలిగి ఉంటాయి. డబుల్‌ ట్యాప్‌ టు ప్లే, ఫోన్‌ను నేరుగా ఆన్సర్‌ చేసేందుకు మరియు Siri వంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌పాడ్స్‌ ఛార్జింగ్‌ కోసం లైటినింగ్‌ పోర్టుతో వస్తుంది. మరియు బ్లూటూత్‌ 5.0 వైర్‌లెస్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 5 గంటలపాటు ప్లేటైం లేదా 3 గంటల వరకు ఫోన్‌కాల్‌ మాట్లాడుకోవచ్చు. అదే ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల పాటు ప్లేటైం లేదా 18 గంటలపాటు కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. iOS కొత్త వెర్షన్‌ ఐఫోన్, ఐప్యాడ్‌ మోడళ్లు మరియు iPadOS కొత్త వెర్షన్‌ ఐప్యాడ్‌ మోడళ్లు మరియు MacOS మోడళ్లకు సపోర్టు చేస్తుంది. కొత్త వెర్షన్‌ tvOS కలిగిన ఆపిల్‌ టీవీలను సపోర్టు చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024 మే 2న ప్రారంభం అయింది. మే 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big saving days sale 2024 offers massive discount on apple Airpods 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X