Home
Gadgets

ఫ్లిప్‌కార్ట్ సేల్‌..రూ.1,299 ధరకే బ్లూటూత్‌ కాలింగ్‌, వాయిస్‌ అసిస్టెంట్, హెల్త్‌ ట్రాకర్లతో స్మార్ట్‌వాచ్‌!

ఫ్లిప్‌కార్ట్‌ ఇవాళ్టి నుంచి బ్లాక్‌ ఫ్రైడే పేరుతో (Flipkart Black Friday Sale 2024) ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌ ఇవాళ్టి నుంచి ఈనెల 29 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడ్‌ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. దీంతోపాటు యాక్సెస్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్ బరోడా, HDFC, IDFC ఫస్ట్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సె్స్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌వాచ్‌పై డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడ్‌ సేల్‌ 2024 లో భాగంగా ఫైర్‌ బోల్ట్‌ నింజా కాలింగ్‌ ప్రో ప్లస్‌ (Fire Boltt Ninja Calling Pro Plus Smartwatch) స్మార్ట్‌వాచ్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ వాచ్‌ను రూ.1299 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌, AI వాయిస్‌ సపోర్టుతో ఉంటుంది.

Flipkart Black Friday Sale november 2024

ఫైర్‌ బోల్ట్‌ నింజా కాలింగ్‌ ప్రో ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌ల వివరాలు :
ఫైర్‌ బోల్ట్‌ నింజా కాలింగ్‌ ప్రో ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ 240*284 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో 1.83 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్‌ నుంచే ఫోన్‌ కాల్స్‌ను స్వీకరించేందుకు వీలుగా బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ 120 స్పోర్ట్స్‌ మోడ్‌ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో హెల్త్‌ ట్రాకర్‌లు :
ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉంది. మహిళల కోసం ప్రత్యేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు హార్ట్ రేట్‌ ట్రాకర్‌, స్లీప్‌ మానిటర్‌, SpO2 ట్రాకర్‌ సహా డ్రింక్‌ వాటర్‌ రిమైండర్‌ వంటి అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతో వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు.

Flipkart Black Friday Sale november 2024

ఈ ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 6 రోజులపాటు వినియోగించుకోవచ్చు. అదే విధంగా 15 రోజులపాటు స్టాండ్‌బై టైం (Standby Time) ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ నేవీ బ్లూ, బ్లాక్‌ గోల్డ్‌, గ్రే, పింక్‌, బ్లాక్ వంటి రంగుల్లో కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఫైర్‌ బోల్ట్‌ నింజా కాలింగ్ ప్రో ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఫోన్‌ కెమెరా, మ్యూజిక్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. దీంతోపాటు సౌకర్యవంతమైన డయల్‌ ప్యాడ్‌, కాల్‌ హిస్టరీ, sync కాంటాక్ట్‌ ఫీచర్‌ కూడా ఉంది. దీంతోపాటు డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఇన్‌బిల్ట్‌ గేమ్స్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Flipkart Black Friday Sale november 2024

దీంతోపాటు ఈ వాచ్‌ అనేక వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంది. మరియు ఈ వాచ్‌ IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. తక్కువ ధరలో ప్రస్తుతం ఈ వాచ్‌ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ నవంబర్‌ 29 వరకు నిర్వహించనుంది. అప్పటి వరకు ఈ వాచ్‌పై డిస్కౌంట్‌ ఉంటుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Flipkart Black Friday Sale offers best deal on Fire Boltt ninja calling Pro plus smartwatch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X