80 శాతం డిస్కౌంట్లతో Flipkart సేల్

బిగ్ 10 సేల్‌ విజయంతో మంచి ఊపు మీదున్న Flipkart మరో సేల్‌ను లాంచ్ చేసింది. సమ్మర్ షాపింగ్ డేస్ పేరుతో మే 29న ప్రారంభమైన ఈ సేల్ మే 31తో ముగుస్తుంది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ అలానే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్కౌంట్లను అందుకున్న ఫోన్‌ల జాబితా

డిస్కౌంట్లను అందుకున్న ఫోన్‌ల జాబితాలో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో, మోటో ఎమ్, లెనోవో కే5 నోట్ వంటి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఐఫోన్ 7 మోడల్స్ పై రూ.30000 వరకు తగ్గింపు..

ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 7 అలానే ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్‌ల పై రూ.15,501 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద రూ.15,000 వరకు వర్తిస్తుంది. దీంతో ఐఫోన్ మోడల్స్ పై రూ.30,000 వరకు తగ్గింపును పొందే వీలుంటుంది.

నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం కూడా..

ఈఎమ్ఐ పై ఈ ఫో‌న్‌‌లను సొంతం చేసుకోవాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అలానే డెబిట్‌కార్డ్ యూజర్లకు 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. PhonePe యూజర్లకు 25శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ పై రూ.17,000 తగ్గింపు

ఇదే సేల్‌లో భాగంగా ఐఫోన్ 6ఎస్ ప్లస్ 3జీబి వేరియంట్ పై రూ.17,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.39,999కే 6ఎస్ ప్లస్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లను కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

 

గెలాక్సీ జే3 ప్రో మోడల్ పై

ఇదే సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో మోడల్ పై రూ.500 తగ్గింపుతో పాటు రూ.7,500 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచింది.

రూ.1000 తగ్గింపుతో గెలాక్సీ జే5

ఇదే సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016) మోడల్ రూ.1000 తగ్గింపుతో రూ.9,990కి ట్రేడ్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ.9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది.

మోటో జీ5 ప్లస్, మోటో ఎమ్, వివో వీ5

ఇదే సేల్‌లో భాగంగా మోటో జీ5 ప్లస్, మోటో ఎమ్, వివో వీ5 ఫోన్ లు కూడా డిస్కౌంట్లు పై ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ పేజీలో ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

టీవీలుచ ఏసీల పై 80 శాతం వరకు డిస్కౌంట్ల

ఇదే సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ అలానే యాక్సెసరీస్ పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. బ్రాండెడ్ టీవీలు ఇంకా ఏసీల పై 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. గూగుల్ క్రోమ్‌కాస్ట్ 2ను రూ.2,999కే సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Summer Shopping Days Sale: Offers on iPhone 7, iPhone 6s Plus, Samsung Galaxy J3 Pro and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot