Home
Gadgets

రూ. 799కే 10,000 mAh పవర్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్ !

దేశీయ దిగ్గజం Flipkart సరికొత్తగా ముందుకు దూసుకొస్తోంది. తన బిలియన్ బ్రాండ్ విస్తరణలో భాగంగా కొత్త కొత్త ఉత్పత్తలతో ముందుకు దూసుకువస్తోంది.

By Hazarath

దేశీయ దిగ్గజం Flipkart సరికొత్తగా ముందుకు దూసుకొస్తోంది. తన బిలియన్ బ్రాండ్ విస్తరణలో భాగంగా కొత్త కొత్త ఉత్పత్తలతో ముందుకు దూసుకువస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా రెండు పవర్ బ్యాంకులు లాంచ్ చేసింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్‌ గాడ్జెట్ రంగంలోనూ తన సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే అత్యంత తక్కువ ధరలో ఈ పవర్ బ్యాంకులను రిలీజ్ చేసింది.

ధర

ధర

Flipkart విడుదల చేసిన 10000 ఎంఏహెచ్‌ వెర్షన్‌ బ్యాటరీ ధర రూ. 799రూపాయలు. అలాగే 15000 ఎఎహెచ్ కెపాసిటీ కలిగిన మోడల్ ధర రూ. 999 . ఈ రెండు మోడల్స్ పవర్ పుల్ యూఎస్బీ పోర్ట్స్ కలిగి ఉంది. అన్ని యూఎస్బీ పోర్ట్లకు కూడా 5 వీ / 2.1 ఎ పవర్ అవుట్పుట్ సామర్థ్యం ఉంది. ఏ + గ్రేడ్ '' '' లిథియం-అయాన్ '' బ్యాటరీస్తో ఇవి రూపొందాయి.

కాపర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్‌ ఆప్షన్లలో ..

కాపర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్‌ ఆప్షన్లలో ..

ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్‌, కాపర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఈ పవర్‌ బ్యాంక్‌లకు ఎల్‌ఈడీ టార్చ్‌ కూడా ఉంది. ఏడు రకాల భద్రతాపరమైన ఫీచర్లతో బిలియన్‌ పవర్‌ బ్యాంక్‌లను తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ చెప్పింది. వాటిలో అండర్‌-ఓల్టేజీ, ఓవర్‌ ఓల్టేజీ ప్రొటెక్షన్‌, బిల్ట్‌-ఇన్‌ ప్రొటెక్షన్‌, షార్ట్‌-సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. టాప్‌-సెల్లింగ్‌ పవర్‌ బ్యాంక్‌ల కంటే 13 శాతం తేలికగా ఉన్నట్టు కూడా కంపెనీ తెలిపింది.

భారతీయులు అభిరుచులకు అనుగుణంగా..

భారతీయులు అభిరుచులకు అనుగుణంగా..

డిజైన్‌ పరంగా రంగుల నుంచి కూడా భారతీయులు అభిరుచులకు అనుగుణంగా ఈ పవర్‌ బ్యాంక్‌లను వీటిని రూపొందించామని, భారతీయులు ఎక్కువగా రోజ్‌ గోల్డ్‌, కాపర్‌ కలర్స్‌ను ఇష్టపడతారని బిలియన్‌ కేటగిరీ హెడ్‌ హ్రిషికేష్ థైట్ తెలిపారు. ఈ పవర్‌ బ్యాంక్‌లకు ఏడాది పాటు ఇంటి వద్దనే సర్వీసు వారెంటీని కూడా కల్పిస్తోంది.

యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డులతో ..

యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డులతో ..

ప్రస్తుతం వీటిని యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కాగ, ఎంఐ పవర్‌ బ్యాంక్‌ 2ఐ కూడా రూ.799కే లభ్యమవుతోంది.

బిలియన్‌ క్యాప్చర్‌+..

బిలియన్‌ క్యాప్చర్‌+..

ఫ్లిప్‌కార్ట్‌ గతేడాది జూలైలో తన బిలియన్‌ బ్రాండును మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండు కింద తొలి ప్రొడక్ట్‌గా బిలియన్‌ క్యాప్చర్‌+ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. దీన్ని యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Flipkart's Billion Brand Launches Power Banks Starting at Rs 799 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X