LG నుంచి మడత పెట్టుకునే టీవీ!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ (LG Electronics Inc) వచ్చే ఏడాది నుంచి ఫోల్డబుల్ టీవీలను మార్కెట్లో విక్రయించబోతున్నట్లు సమచారం.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ (LG Electronics Inc) వచ్చే ఏడాది నుంచి ఫోల్డబుల్ టీవీలను మార్కెట్లో విక్రయించబోతున్నట్లు సమచారం. ఈ పెద్ద స్ర్కీన్ టీవీలను పోస్టర్‌లా మడత పెట్టేసుకోవచ్చట.

65 అంగుళాల స్క్రీన్...
65 అంగుళాల స్క్రీన్ సైజులను కలిగి ఉండే ఈ టీవీలు బటన్ పై టచ్ చేసిన వెంటనే గ్యారేజ్ డోర్ తరహాలో ముడుచుకు పోతాయట. ఈ టీవీలు సులువుగా ఫోల్డ్ అయ్యేందుకు వీలుగా ఆర్గానిక్ లైట్-ఎమిటింగ్ డయోడ్ (organic light-emitting diode) స్ర్కీన్‌లను ఎల్‌జీ వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ స్ర్కీన్‌లు సాంప్రదాయ లిక్విడ్-క్రిస్టల్ డిస్‌ప్లే ప్యానల్స్‌తో పోలిస్తే మడత పెట్టేందుకు మరింత అనువుగా ఉంటాయట.

స్మార్ట్‌టీవీల విభాగంలో
స్మార్ట్‌టీవీల విభాగంలో రోజురోజుకు పెరుగిపోతోన్న కాంపిటీషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గత కొంత కాలంగా విప్లవాత్మక ఆవిష్కరణల ఫోకస్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనూ రోలబుల్(rollable) ఇంకా ఓఎల్ఈడి (OLED) టెలివిజన్స్ పై ఎల్‌జీ తన రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను ముమ్మరం చేసింది.

ప్రోటో టైప్ టెలివిజన్‌ను...
ఈ క్రమంలోనే ఓ ప్రోటో టైప్ టెలివిజన్‌ను సియోల్‌లోని తన రిసెర్చ్ సెంటర్‌లో ఎల్‌జీ ప్రదర్శిస్తోంది. ఈ టీవీని ఎప్పడు కావాలంటే అప్పుడు మడత పెట్టేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్లిపోవచ్చు. ఎల్‌జీ, తాను అభివృద్థి చేసిన రోలబుల్ స్ర్కీన్ టెక్నాలజీని 2018 ఆరంభంలోనే ప్రపంచానికి పరిచయం చేసినప్పటికి ఇంకా కమర్షియల్ మార్కెట్లోకి తీసుకురాలేదు. 2019లో ఇది సాధ్యపడొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

టీవీల అమ్మకాలకు
2018కుగాను ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న టీవీల అమ్మకాలకు సంబంధించి tracker Statista రివీల్ చేసిన వివరాల ప్రకారం ఎల్‌సీడీ టీవీలు అమ్మకాలు 98 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఓఎల్ఈడి (OLED) టీవీలు అమ్మకాల సంఖ్య 1.1 శాతంగానే ఉందట.ఓఎల్ఈడి టీవీల అమ్మకాలు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికి 2019 పూర్తయ్యే నాటికి 70 శాతానికి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌టీవీల పై...
ఓ వైపు ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌టీవీల పై దృష్టిసారిస్తూనే 5జీ వైర్‌లెస్ టెక్నాలజీ పై కూడా ఎల్‌జీ ష్టిసారిస్తోంది. తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం 2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా ఎల్‌జీ తన మొట్టమొదటి 5జీ సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఎల్‌జీ బాటలోనే సామ్‌సంగ్, ఆపిల్, హువావే, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు సైతం 5జీ సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








