200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?

|

ఇప్పుడు వీడియో గేములనేవి కేవలం చిన్నారుల జీవితాలపైనే కాకుండా పెద్దల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్నే చూపిస్తున్నాయి. ఒక వీడియో గేమ్ వందలమంది జంటల విడాకులకు కారణంగా అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక సర్వేను అనుసరించి ఫోర్ట్‌నైట్ అనే వీడియో గేమ్ కారణంగా ఏడాదిలో 200కుపైగా జంటలు విడాకులు తీసుకుంటున్నాయట. ఫైటింగ్ గేమ్ అయిన ఇది కేవలం ఈతరం జనరేషన్‌లోని వ్యక్తులతోపాటు పెద్దవారిని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోందట. కాగా ఈ గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల చందాదారులున్నారు. ఈ గేమ్ విడుదలై ఏడాదే అయిననప్పటికీ అంతకంతకూ ఈ గేమ్‌కు అభిమానుల సంఖ్య పెరిగిపోతున్నదని తెలుస్తోంది. కాగా పరస్పరం కొట్టుకోవడాన్ని ఈ గేమ్ ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ గేమ్ పూర్తి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

వీడియో గేమ్ ద్యాసలో పడి, తుఫానునే మరిచిపోయాడువీడియో గేమ్ ద్యాసలో పడి, తుఫానునే మరిచిపోయాడు

గేమింగ్ లవర్స్‌ కు..

గేమింగ్ లవర్స్‌ కు..

ఎపిక్ గేమ్స్ సంస్థ తయారు చేసిన గేమ్ ఫోర్ట్‌నైట్. గేమింగ్ లవర్స్‌ కు ఈ గేమ్ అంటే పిచ్చి పిచ్చిగా అభిమానిస్తారు. కాగా ప్రస్తుతం ఈ గేమ్ రెండు వర్షన్లలో అందుబాటులో ఉంది.

రెండు వర్షన్లలో..

రెండు వర్షన్లలో..

ఫస్ట్ వర్షన్ 'సేవ్‌ ద వాల్డ్'. నలుగురు ప్లేయర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ గేమ్ ప్రత్యేకత. ఇక 'బ్యాటిల్ రాయల్' రెండో వర్షన్. ఇది ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ గేమ్. వందమంది ప్లేయర్లు ఒకేసారి ఆడొచ్చు. లేదా ఇద్దరు, నలుగురు స్క్వాడ్స్ ఈ గేమ్ ఆడొచ్చు.

తమను తాము రక్షించుకుంటూ..

తమను తాము రక్షించుకుంటూ..

తమను తాము రక్షించుకుంటూ ప్రత్యర్థులను హతమారుస్తూ ముందుకెళ్లడమే ఈ గేమ్. ఇన్నాళ్లూ ఈ గేమ్ కేవలం కంప్యూటర్‌లో మాత్రమే ఉండేది. ఇటీవల స్మార్ట్‌ఫోన్లకు రిలీజ్ చేశారు.

2 కోట్ల 30 లక్షల ప్లేయర్స్
 

2 కోట్ల 30 లక్షల ప్లేయర్స్

ఎపిక్ గేమ్స్ కథనం ప్రకారం ఆండ్రాయిడ్‌లోనే 2 కోట్ల 30 లక్షల ప్లేయర్స్ ఉన్నారు. కోటిన్నర మంది ఏపీకేతో ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

 వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్‌లోకి ..

వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్‌లోకి ..

అయితే ఈ గేమ్ ఎపిక్ గేమ్స్ వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో లభించదు.

రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ..

రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ..

ఫోర్ట్‌నైట్ గేమ్ ద్వారా ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఫోర్ట్‌నైట్ సుమారు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందినట్టు సూపర్ డేటా రీసెర్చ్ అధ్యయనంలో తేలింది.

ఈ ఏడాది 13 వేల కోట్ల ఆదాయం..

ఈ ఏడాది 13 వేల కోట్ల ఆదాయం..

ఈ ఏడాది 13 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. ఇలాంటి ఎన్నో గేమ్స్‌కి ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లేస్టోర్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఫోర్ట్‌నైట్ మాత్రం లభించదు.

ప్లే స్టోర్‌లో లిస్ట్ చేయకపోవడంతో..

ప్లే స్టోర్‌లో లిస్ట్ చేయకపోవడంతో..

ఈ గేమ్‌ను ప్లే స్టోర్‌లో లిస్ట్ చేయకపోవడంతో గూగుల్‌కు రూ.350 కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. ప్లేస్టోర్‌లో వెళ్లి ఫోర్ట్‌నైట్ అని సెర్చ్ చేస్తే అందుబాటులో లేదు అని మెసేజ్ చూపిస్తోంది.

ఆదాయంలో 30శాతం వాటా..

ఆదాయంలో 30శాతం వాటా..

మరి ఫోర్ట్‌నైట్ గేమ్ ప్లేస్టోర్‌లో లభించకపోవడానికి కారణం ఆదాయంలో 30శాతం వాటా గూగుల్ అడుగుతుండటమే కారణమన్న వాదన ఉంది.

 యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని..

యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని..

ఓ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తయారీదారుడితో పాటు గూగుల్ పంచుకోవడం మామూలే. అయితే ఎపిక్ గేమ్స్ మాత్రం ప్లేస్టోర్‌ను పట్టించుకోకుండా నేరుగా తమ వెబ్‌సైట్‌లోనే గేమ్‌ను అందుబాటులో ఉంచింది.

ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్..

ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్..

యూజర్లు ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసి తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఇలా థర్డ్ పార్టీ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి మొదట అనుమతించవు.

సెక్యూరిటీ రిస్క్..

సెక్యూరిటీ రిస్క్..

'ఇన్‌స్టాల్ ఫ్రమ్ అన్‌నోన్ సోర్స్' క్లిక్ చేసి వేరే యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం చాలామందికి అలవాటు. అయితే దీనివల్ల సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది.

ఆపిల్ కూడా ఆదాయంలో 30 శాతం వాటా..

ఆపిల్ కూడా ఆదాయంలో 30 శాతం వాటా..

ఇక ఆపిల్ కూడా ఆదాయంలో 30 శాతం వాటా అడుగుతోంది. ఆపిల్ డివైజ్‌లల్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం కుదరదు కాబట్టి ఎపిక్ గేమ్స్ సంస్థ ఫోర్ట్‌నైట్‌ని ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Fortnite video game caused over 200 divorces in United Kingdom; are PUBG fans next more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X