Fossil Gen 5E స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది!! ధర కూడా ఎక్కువే..

|

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ భారతదేశంలో విడుదలైంది. గత ఏడాది అక్టోబర్‌లో యుఎస్‌లో 42mm, 44mm సైజుల్లో దీనిని ప్రకటించారు. ఇది కంపెనీ వెబ్‌సైట్‌లో మరియు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,495 ధర వద్ద జాబితా చేయబడింది. ఫాసిల్ జెన్ 5E ను పురుషులు మరియు మహిళల కోసం రెండు శైలులలో బ్లాక్ సిలికాన్, స్మోక్ స్టెయిన్లెస్ స్టీల్, బ్రౌన్ లెదర్ మరియు బ్లాక్ స్టెయిన్లెస్ స్టీల్ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. అంతేకాకుండా రోజ్ గోల్డ్-టోన్ స్టెయిన్లెస్ స్టీల్ మెష్, రోజ్ గోల్డ్-టోన్ స్టెయిన్లెస్ స్టీల్ మరియు బ్లష్ సిలికాన్ వంటి ఇతర ఎంపికలు కూడా జాబితాలో చేర్చబడ్డాయి.

 

ఫాసిల్ జెన్ 5E స్పెసిఫికేషన్స్

ఫాసిల్ జెన్ 5E స్పెసిఫికేషన్స్

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 390 × 390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.19-అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఎల్లప్పుడూ ఆన్ లో ఉండే విధంగా డిస్ప్లేలో ఎంచుకోవడానికి అనేక వాచ్ ఫీచర్లను అందిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 1GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది గూగుల్ WearOS తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ పూర్తిగా బ్లూటూత్ 4.2 LE, NFC, GPS, LTE మరియు Wi-Fi కి మద్దతు ఇస్తుంది.

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఆఫ్-బాడీ IR మరియు PPG హృదయ స్పందన సెన్సార్ వంటివి ఉన్నాయి. స్మార్ట్ వాచ్ Google WearOS తో రన్ అవుతూ వినియోగదారులకు నోటిఫికేషన్లను, సంగీతం వంటివి అనుమతించడంతో పాటుగా ఇంటిలోని స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించగలదు మరియు ఈ వాచ్ ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ QR పద్దతిలో పేమెంట్స్ చేయగల అనేక ఫీచర్లను అందిస్తుంది.

 

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి అంతర్నిర్మిత స్పీకర్ మరియు మైక్‌ను కలిగి ఉంది. ఎక్స్‌టెండెడ్ మోడ్‌లో బ్యాటరీ 24 గంటలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌ను సుమారు 50 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఫిట్‌నెస్ ఫీచర్లలో హృదయ స్పందన రేటు, స్టెప్స్, స్లీప్, కార్డియో స్టేటస్ వంటి మరిన్నింటిని ట్రాక్ చేసే సామర్థ్యం ఉన్నాయి. యాక్టివిటీ ట్రాకింగ్ మరియు అనేక బ్యాటరీ మోడ్‌ల కోసం ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ గూగుల్ ఫిట్‌కు మద్దతు ఇస్తుంది.

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ టచ్‌స్క్రీన్‌ ఆండ్రాయిడ్ ఫీచర్స్

ఫాసిల్ జెన్ 5E స్మార్ట్‌వాచ్ టచ్‌స్క్రీన్‌ ఆండ్రాయిడ్ ఫీచర్స్

ఫాసిల్ సంస్థ ఇటీవలే తన మొదటి LTE స్మార్ట్‌వాచ్ - Gen 5 LTE టచ్‌స్క్రీన్‌ను విడుదల చేసింది. గత నెలలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2021 లో దీనిని ఆవిష్కరించారు. ఫాసిల్ Gen 5 LTE టచ్‌స్క్రీన్ స్మార్ట్‌వాచ్ US లోని వెరిజోన్ నెట్‌వర్క్‌లో 4G సెల్యులార్ కనెక్టివిటీకి మద్దతుతో పాటుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మద్దతుతో పనిచేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Fossil Gen 5E Smartwatch Released in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X