Home
Gadgets

samsung Ganesh Chaturthi Offer: Samsung ఉత్పతుల కొనుగోలు మీద అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

వినాయక చవితి సందర్భంగా శామ్సంగ్ సంస్థ ఇండియాలో తన టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండీషనర్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. వీటితో పాటుగా శామ్సంగ్ QLED టివిలు, 4K UHD టివిలు, ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ మరియు టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లు వంటి శామ్‌సంగ్ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు శామ్‌సంగ్ యొక్క హామీ ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.

శామ్‌సంగ్ గణేష్ చతుర్థి ఫైనాన్స్ స్కీమ్‌

శామ్‌సంగ్ గణేష్ చతుర్థి ఫైనాన్స్ స్కీమ్‌

ఇందులో ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లతో పాటు అనేక ఆకర్షణీయమైన నెలవారీ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆఫర్లు ఆగస్టు 31, 2020 వరకు చెల్లుబాటు అవుతాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా శామ్‌సంగ్ QLED 8K టివిలను కొనుగోలు చేసే వినియోగదారులు గెలాక్సీ S20 + ను ఉచితంగా పొందుతారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ వినియోగదారులకు రూ.15 వేల వరకు క్యాష్‌బ్యాక్

శామ్‌సంగ్ వినియోగదారులకు రూ.15 వేల వరకు క్యాష్‌బ్యాక్

శామ్‌సంగ్ యొక్క QLED 8K టివిలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు సంస్థ దాని యొక్క ప్యానెల్‌ మీద 10 సంవత్సరాల "స్క్రీన్ బర్న్-ఇన్" వారంటీ కూడా అదనంగా అందిస్తున్నది. ఇంకా శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు "ఈజీ ఇఎంఐ" సదుపాయంతో పాటు రూ.15 వేల వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నది.

 

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలో EMI ఆఫర్

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలో EMI ఆఫర్

ప్రస్తుతం శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలను ఈజీ EMI ఆఫర్ కింద రూ.990 నుంచి కొనుగోలు చేయవచ్చు. 43 అంగుళాలు మరియు అంతకంటే ఎక్కువ పరిమాణం గల స్క్రీన్‌లతో కూడిన టీవీ మోడళ్లపై శామ్‌సంగ్ ఈ ప్రత్యేక ఇఎంఐ ఆఫ్‌ను అందిస్తుంది. శామ్సంగ్ తన టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు Zee5 వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్ కు ఒక నెల చందాను ఉచితంగా అందుకుంటారు. అలాగే శామ్‌సంగ్ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు Zee5 ప్రీమియం ప్యాక్‌పై 30% వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్‌

శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్‌

శామ్‌సంగ్ స్పేస్‌మాక్స్ ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.37,999 తగ్గింపు ధర వద్ద అందించనున్నారు. సంస్థ యొక్క రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 15% వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు. అలాగే వీటిని రూ.990 నుండి ప్రారంభమయ్యే EMI ఎంపికల పద్ధతి ద్వారా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ టీవీల్లోని ఆఫర్ మాదిరిగానే EMI పద్దతిలో 300 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యంగల రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్స్ లభిస్తాయి.

శామ్‌సంగ్ ఎయిర్ కండిషనర్లు మరియు స్మార్ట్ ఓవెన్లు కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్‌

శామ్‌సంగ్ ఎయిర్ కండిషనర్లు మరియు స్మార్ట్ ఓవెన్లు కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్‌

శామ్‌సంగ్ సంస్థ యొక్క ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు రూ .990 నుంచి ప్రారంభమయ్యే ఈజీ ఇఎంఐ ఆప్షన్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శామ్‌సంగ్ విండ్ ఫ్రీ ఎయిర్ కండీషనర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 15% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎయిర్ కండీషనర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు కండెన్సర్ మరియు పిసిబి కంట్రోలర్‌పై ఐదేళ్ల వారంటీతో పాటు "సెలెక్ట్" మోడళ్లపై డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ కూడా ఇవ్వబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Ganesh Chaturthi Festival Offer: Great Offers on Samsung QLED TV and Galaxy S20+ Phone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X