అమోలెడ్ డిస్‌ప్లే, సోలార్ ఛార్జింగ్‌తో గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే.
Garmin Instinct 3 smartwatches: సాహసాలు, క్రీడలు, అవుట్‌డోర్ యాక్టివిటీస్ అంటే ఇష్టపడే వారి కోసం గార్మిన్ (Garmin) సంస్థ తమ సరికొత్త ఇన్‌స్టింక్ట్ 3 (Instinct 3) సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ వాచ్‌లు చాలా దృఢంగా ఉంటాయి, ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకునేలా వీటిని తయారుచేశారు.
మిలిటరీ గ్రేడ్ MIL-STD 810 ప్రమాణాలను అందుకున్న ఈ వాచ్‌లు అధిక ఉష్ణోగ్రతలు, దెబ్బలు, నీటిలో 100 మీటర్ల లోతు వరకు కూడా తట్టుకోగలవు. చీకటిలో దారి చూసుకోవడానికి వీలుగా ఇందులో ప్రత్యేకంగా LED ఫ్లాష్‌లైట్‌ను కూడా అమర్చారు. ఇంకా ఈ వాచీల ప్రత్యేకలు ఏంటో తెలుసుకుందాం పదండి.

* కొత్తగా అమోలెడ్ డిస్‌ప్లే, సోలార్ ఛార్జింగ్ ఆప్షన్..
ఇన్‌స్టింక్ట్ సిరీస్ స్మార్ట్‌వాచ్‌లలో మొదటిసారిగా, గార్మిన్ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఆప్షన్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చినట్లుగా, ప్రకాశవంతమైన రంగులతో కళ్లు చెదిరేలా కనిపించే అమోలెడ్ స్క్రీన్ ఉన్న వాచ్‌ను గానీ, లేదా సూర్యరశ్మితో ఛార్జ్ అవుతూ ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ ఇచ్చే సోలార్ మోడల్‌ను గానీ ఎంచుకోవచ్చు.
అమోలెడ్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 రోజుల వరకు పనిచేస్తుంది. అదే సోలార్ మోడల్ అయితే, తగినంత ఎండ తగిలితే చాలు, బ్యాటరీ లైఫ్ దాదాపు ఎప్పటికీ ఉంటుంది. ఈ ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ వాచ్‌లు రెండు సైజుల్లో (45mm, 50mm) లభిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే, దీనికి మెటల్ ఫ్రేమ్‌తో పటిష్టతను జోడించారు.
* పాలిమర్ కేస్, స్క్రాచ్-రెసిస్టెంట్
అలాగే ఫైబర్-రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ కేస్‌తో మరింత గట్టితనాన్ని ఇచ్చారు. దీని డిస్‌ప్లేపై గీతలు పడకుండా ఉండేలా (స్క్రాచ్-రెసిస్టెంట్) రూపొందించారు, కాబట్టి మన్నిక విషయంలో దిగులుపడాల్సిన అవసరం లేదు. ఇవి బ్లాక్, బ్లాక్/చార్‌కోల్ (Charcoal) రంగులలో లభిస్తాయి. వీటితో పాటు నియోట్రోపిక్ (Neotropic), నియోట్రోపిక్/ట్విలైట్ (Neotropic/Twilight) వంటి కొన్ని స్పెషల్ ఎడిషన్ రంగులు కూడా ఉన్నాయి.
* అత్యుత్తమ ట్రాకింగ్, GPS నావిగేషన్
ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, మీరు ఎక్కడున్నారో పక్కాగా చూపించడానికి ఇందులో మల్టీ-బ్యాండ్ GPS, సాట్ఐక్యూ (SatIQ) టెక్నాలజీని ఉపయోగించారు. దారి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆల్టిమీటర్ (ఎత్తును కొలిచేది), బారోమీటర్ (వాతావరణ పీడనాన్ని కొలిచేది), కంపాస్ (దిక్సూచి) వంటి ABC సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
దారి తప్పిపోకుండా, వెళ్లిన దారిలోనే తిరిగి రావడానికి \'ట్రాక్‌బ్యాక్\' (TracBack) ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ట్రెక్కింగ్, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ఇది బాగా సరిపోతుంది. అపరిచిత ప్రాంతాల్లో సైతం నమ్మకంగా ముందుకు సాగవచ్చు. వెళ్లిన దారిని గుర్తుపెట్టుకుని, సురక్షితంగా వెనక్కి రావడానికి ఇది భరోసా ఇస్తుంది.
* ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఫీచర్లు
ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లలో మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు అత్యాధునిక ఫీచర్లున్నాయి. గుండె వేగాన్ని (Heart rate) ట్రాక్ చేయడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను (Pulse Ox) కొలవడం, నిద్రను విశ్లేషించడం (Sleep analysis), ఒత్తిడిని గమనించడం (Stress tracking), హెచ్‌ఆర్‌వి (HRV status) వంటివి ఉన్నాయి.
మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఫీచర్ కూడా ఉంది. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్కీయింగ్, జిమ్ వర్కౌట్స్ వంటి ఎన్నో రకాల క్రీడలకు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పైనే యానిమేషన్లతో వర్కౌట్స్ చూపిస్తుంది, గార్మిన్ కోచ్ (Garmin Coach) సలహాలు, మీ కోసం ప్రత్యేకంగా రోజువారీ వర్కౌట్ సూచనలు కూడా అందిస్తుంది.
* స్మార్ట్ కనెక్టివిటీ, భద్రత
మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు వాచ్‌లోనే చూసుకోవచ్చు (Smart notifications). గార్మిన్ మెసెంజర్ (Garmin Messenger) యాప్ ద్వారా నేరుగా వాచ్ నుంచే మెసేజ్‌లు పంపవచ్చు, స్వీకరించవచ్చు. మీరు ఎక్కడున్నారో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తెలుసుకోవడానికి లైవ్‌ట్రాక్ (LiveTrack) ఫీచర్ ఉంది.
అలాగే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే గుర్తించి, మీ కాంటాక్ట్స్‌కు సమాచారం పంపే ఇన్సిడెంట్ డిటెక్షన్ (Incident detection) ఫీచర్ అదనపు భద్రతను ఇస్తుంది. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు లేదా కఠినమైన యాక్టివిటీస్ చేసే సమయంలో ఇది ఎంతో కీలకం. ఆపద సమయంలో మీ వారికి వెంటనే సమాచారం అందిస్తుంది
* ధర, లభ్యత
ఇన్‌స్టింక్ట్ 3E బేస్ మోడల్ వాచ్ ధర రూ.35,990 నుంచి మొదలవుతుంది. ఇక ఇన్‌స్టింక్ట్ 3 అమోలెడ్, సోలార్ మోడళ్ల ధర రూ.46,990గా ఉంది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను గార్మిన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఎంపిక చేసిన ప్రీమియం రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








