ఆపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్‌లపై 100 శాతం రిఫండ్.. పూర్తి వివరాలు..!
ఆపిల్ వాచ్ అంటే చాలా మందికి ఎంతో ఫేవరెట్. అయితే అధిక ధర కారణంగా కొంత మంది ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌వాచ్ లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఓ సూపర్ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగా ఆపిల్ వాచ్ ను (Get An Apple Watch For Free) ఉచితంగా పొందవచ్చు. కేవలం నడిస్తే చాలా ఉచితంగా ఆపిల్ వాచ్ సిరీస్ 10 సహా మరిన్ని మోడళ్ల పై మాత్రమే ఉంది. పూర్తి వివరాలు.
HDFC ఎర్గో 'ఇండియా గెట్స్ మూవింగ్' కార్యక్రమం కోసం జోపర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూజర్లు అర్హత సాధిస్తే ఆపిల్ వాచ్ పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. ప్రస్తుతం ఈ ఆఫర్ ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా పై ఉంది. దీని వెనుకున్న ఉద్దేశాన్ని కూడా సంస్థ వెల్లడించింది.

ఆపిల్ వాచ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందేందుకు invent, యూనికార్న్ నుంచి ఆపిల్ వాచ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇండియా గెట్స్ మూవింగ్ కార్యక్రమంలో భాగంగా జోపర్ వెల్‌నెస్ ప్రోగ్రాంలో ఉచితంగా sign up కానున్నారు. అనంతరం HDFC ఎర్గో ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలో ఎన్‌రోల్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం HDFC ఎర్గో యాప్ ను డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌తో ఆపిల్ హెల్త్ హిట్‌ను జతచేస్తారు. దీని ద్వారా మీరు ప్రతిరోజు ఎన్ని అడుగులు వేశారో లెక్కిస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని రివార్డు పాయింట్లను అందిస్తుంది. ఇలా సంవత్సరకాలం పాటు అడుగులు లెక్కిస్తారు. 15000 అడుగులు పాటు రోజు నడవాల్సి ఉంటుంది. ఫలితంగా ఆపిల్ వాచ్ కొనుగోలుపై 100 శాతం రిఫండ్ పొందవచ్చు.
ఆపిల్ వాచ్‌పై రిఫండ్ తో పాటు జోపర్ వెల్‌నెస్ ప్రోగ్రాంలో భాగంగా లక్ష రూపాయల వరకు HDFC ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీని అందిస్తుంది. దీంతోపాటు హెల్త్ సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మరియు నిపుణులతో పర్సనల్ మెంటల్ హెల్త్ కోచింగ్ ను ఉచితంగా పొందవచ్చు.
ఆపిల్ వాచ్ సిరీస్ 10 (Apple Watch Series 10) పాలిష్డ్ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంది. ఈ వాచ్ S10 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ వాచ్ సిరీస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా 80 శాతం ఛార్జింగ్ ను కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్లీప్ apnea డిటెక్షన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra) టైటానియంతో కూడిన 49mm రెటీనా డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో ఉంది. ఈ వాచ్ యాక్షన్ బటన్ ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఈ వాచ్ 36 గంటల బ్యాటరీ లైఫ్ ను పొందుతుంది. దీంతోపాటు 100 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








