ప్రీఆర్డర్ పై గాడ్ ఆఫ్ వార్ గేమ్స్, భారత్‌లో లభ్యం

|

గేమింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సోనీ కార్పొరేషన్ మొట్టమొదటి సారిగా భారత్‌లో కలెక్టర్స్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ గేమ్‌లను ప్రీ-ఆర్డర్ పై అందుబాటులో ఉంచింది. ఈ రెండు ఎడిషన్‌లతో పాటు స్టాండర్డ్ ఎడిషన్‌ను కూడా సోనీ అమ్మకానికి ఉంచింది. ప్రస్తుతానికి ఈ ప్రీ-ఆర్డర్స్ ఢిల్లీ, ముంబైలలోని రిటైల్ షాప్‌లలో యాక్టివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ ఎడిషన్‌లో డిజిటల్ అలానే ఫిజికల్ కంటెంట్ ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. డిజిటల్ కంటెంట్‌లో డెత్ వోవ్ ఆర్మర్ సెట్, ఎక్సైల్స్ గార్డియన్ షీల్డ్, డార్క్‌హార్స్ కామిక్, డైనమిక్ థీమ్ వంటి అంశాలు పొందుపరచబడి ఉంటాయి. ఇక ఫిజికల్ కంటెంట్‌లో గేమ్‌కు సంబంధించిన స్టీల్ బుక్‌కేస్‌తో పాటు ఫిజికల్ డిస్క్, 9 అంగుళాల క్రాటోస్ అండ్ ఆట్రియస్ స్టాట్యూ, క్లాత్ మ్యాప్, ఎక్స్‌క్లూజివ్ లితోగ్రాఫ్ వంటి మెటీరియల్స్ ఉంటాయి. ఈ గేమ్ ధర రూ.9,490.

 

BSNL హోలీ ధమాకా, జియో కన్నా ఎక్కువ డేటా !BSNL హోలీ ధమాకా, జియో కన్నా ఎక్కువ డేటా !

 గాడ్ ఆఫ్ వార్ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతలు..

గాడ్ ఆఫ్ వార్ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతలు..

ఈ ఎడిషన్‌లో డిజిటల్ అలానే ఫిజికల్ కంటెంట్ ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. డిజిటల్ కంటెంట్‌లో డెత్ వోవ్ ఆర్మర్ సెట్, ఎక్సైల్స్ గార్డియన్ షీల్డ్, డైనమిక్ థీమ్ వంటి అంశాలు పొందుపరచబడి ఉంటాయి. ఇక ఫిజికల్ కంటెంట్‌లో గేమ్‌కు సంబంధించిన బ్లాక్ ఇంకా సిల్వర్ స్టీల్ బుక్, డార్క్ హార్స్‌కు సంబంధించి ఫిజికల్ కాపీలు ఉంటాయి.

‘గాడ్ ఆఫ్ వార్ స్టోన్ మాసన్’ కేవలం యూఎస్‌లో మాత్రమే..

‘గాడ్ ఆఫ్ వార్ స్టోన్ మాసన్’ కేవలం యూఎస్‌లో మాత్రమే..

సోనీ విడుదల చేసిన మరో ఎడిషన్ ‘గాడ్ ఆఫ్ వార్ స్టోన్ మాసన్' కేవలం యూఎస్ లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది. ఈ ఎడిషన్ లో కలెక్టర్ ఎడిషన్ కంటెంట్ తో పాటు స్టోన్ మాసన్స్ రింగ్, మైమిర్స్ హెడ్ టాకింగ్ కీ-చెయిన్, 2 అంగుళాల గుర్రం, ట్రోల్ కార్వింగ్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ వార్ ఏప్రిల్ 20న భారత్ లో విడుదల కాబోతోంది. ఈ గేమ్‌ను PS4.Inలో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది.

వీడియోగేమ్స్‌తో ముప్పే..
 

వీడియోగేమ్స్‌తో ముప్పే..

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్‌లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు యువతను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు.

వీడియో గేమ్స్‌ వ్యసనం

వీడియో గేమ్స్‌ వ్యసనం

వీడియో గేమ్స్‌ వ్యసనం వల్ల అనారోగ్యమే కాకుండా... పిల్లల్లో హింసా ప్రవృత్తీ, దూకుడుతనం లాంటి మానసిక సమస్యలూ ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీటివల్ల మూర్ఛ ముప్పు సైతం పెరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో వైద్యులు గుర్తించారు. ఇంకా... జీవక్రియ వేగం పెరగటం, చేతులకు "రిపిటీటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజురీ" లాంటి సమస్యలు పెరగటం సైతం వారు గమనించారు.

పిల్లలు హోంవర్క్ చేయడంలోనూ‌

పిల్లలు హోంవర్క్ చేయడంలోనూ‌

అంతేకాకుండా... పిల్లలు హోంవర్క్ చేయడంలోనూ‌, చదువు సంధ్యలలోనూ బాగా వెనుకబడుతుండటం, కుటుంబ సభ్యులకు దూరమవడం లాంటి విషయాలు పై అధ్యయనంలో వెల్లడైనాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బ్రిటన్‌, అమెరికా దేశాలలో చాలామంది పిల్లలు వీడియోగేమ్స్ వ్యసనాల బారిన ఇప్పటికే పడ్డారని, మరికొంతమంది ఆ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
God of War Collector's and Limited Editions Up for Pre-Order in India: Price, Release Date, and More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X