స్మార్ట్ డిస్‌ప్లే సదుపాయంతో Google Home Hub

హోమ్ హబ్ (Home Hub) పేరిట సరికొత్త స్మార్ట్ స్పీకర్‌ను గూగుల్ అనౌన్స్ చేసింది. ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ స్పీకర్‌కు 7 అంగుళాల టచ్ స్క్రీన్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది.

|

హోమ్ హబ్ (Home Hub) పేరిట సరికొత్త స్మార్ట్ స్పీకర్‌ను గూగుల్ అనౌన్స్ చేసింది. ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ స్పీకర్‌కు 7 అంగుళాల టచ్ స్క్రీన్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ స్పీకర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ డిస్‌ప్లే ప్రత్యేకమైన సదుపాయాలను కలిగి ఉండటం విశేషం. ఈ డివైస్ యూజర్ అడిగే ప్రశ్నలకు వాయిస్ నోట్ రూపంలో సమాధానం ఇవ్వటంతో పాటు స్క్రీన్ పై కూడా ఫలితాలను చూపించగలుగుతుంది.

 

కెమెరా సదుపాయం అందుబాటులో లేదు..

కెమెరా సదుపాయం అందుబాటులో లేదు..

గోప్యతా పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ డివైస్‌లో ఎటువంటి కెమెరాను గూగుల్ యాడ్ చేయలేదు. కెమెరా సదుపాయం లోపించటంతో ఈ డివైస్‌లో వీడియో కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉండదు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ ఫోటోస్ వంటి కీలక ఫీచర్స్ ఈ స్మార్ట్ స్పీకర్‌లో ముందుగానే లోడ్ అయి ఉన్నాయి.

 

 

మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో...

మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో...

మీకు సంబంధించిన అన్ని గూగుల్ అకౌంట్స్‌తో కనెక్ట్ అయి ఉండే ఈ స్పీకర్ ఫోన్ ద్వారా మీకు క్లిక్ చేసే ప్రతి ఫోటోను గూగుల్ ఫోటోస్ ఆల్బమ్‌లో డిస్‌ప్లే చేయటంతో పాటు మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో బ్లర్రీ ఇంకా చెడుగా ఎక్స్‌పోజ్ అయిన ఫోటోలను ఆల్బమ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తుంది. గూగుల్ హోమ్ హబ్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ధర 149 డాలర్లు. యూఎస్, యూకే ఇంకా ఆస్ట్రేలియా మార్కెట్లలో అక్టోబర్ 22 నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ బాటలోనే ఫేస్‌బుక్ కూడా..
 

గూగుల్ బాటలోనే ఫేస్‌బుక్ కూడా..

గూగుల్ బాటలోనే ఫేస్‌బుక్ కూడా రెండు సరికొత్త వీడియో కాలింగ్ డివైస్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. పోర్టల్, పోర్టల్ ప్లస్ పేర్లతో ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ స్పీకర్ డివైసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ యూజర్స్ వీడియో చాటింగ్‌ను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆఫర్ చేస్తుంది. అమెజాన్ అలెక్సా సపోర్ట్‌తో వస్తోన్న ఈ రెండు డివైసెస్‌ను వాయిస్ కంట్రోల్స్ ఆధారంగా ఆపరేట్ చేసుకునే వీలును కల్పించారు.

టాబ్లెట్స్ తరహాలో..

టాబ్లెట్స్ తరహాలో..

ఈ రెండు డివైసెస్ టాబ్లెట్స్ తరహాలో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ అయిన పోర్టల్ 10 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 199 డాలర్లు. ఇక రెండవ మోడల్ అయిన పోర్టల్ ప్లస్ 15 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 349 డాలర్లు. ఇండియన్ మార్కెట్లో వీటి అందుబాటుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

 

 

 

స్పాటిఫై, పాండోరా, ఐహార్ట్‌రేడియో...

స్పాటిఫై, పాండోరా, ఐహార్ట్‌రేడియో...

ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో స్పాటిఫై, పాండోరా, ఐహార్ట్‌రేడియో, ఫేస్‌బుక్ వాచ్, ఫుడ్ నెట్‌వర్క్, స్ర్కిప్స్ న్యూసీ వంటి సర్వీసెస్ ముందస్తుగానే లోడై ఉంటాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మరిన్ని సర్వీసులను ఇందులో యాడ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ ఆప్షన్స్ ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో మిస్ అయ్యాయి.

 

 

Best Mobiles in India

English summary
Google Home Hub is the new entrant in the smart display space.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X