గూగుల్ బడ్స్‌తో ఏకంగా 40 భాషల్లో సంభాషించవచ్చు
చేతిలో గూగుల్ పిక్సెల్ ఫోన్.. ‘బడ్స్’ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు. మీరు 40 భాషలు నేర్చేసుకోవచ్చు.
శాంసంగ్, ఆపిల్ ఫోన్లకు సవాల్ విసురుతూ గూగుల్ తన పిక్సల్ 2 ఫోన్లను రిలీజ్ చేసింది. మరి ఈ ఫోన్లు వాటికి సవాలుగా మారుతాయా..ఆ ఫోన్లలో దమ్మెంత అనేది ఇప్పుడు టెక్ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది. ఇదిలా ఉంటే గూగుల్ కొత్త ఫోన్లతో పాటు బడ్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఏకంగా 40 భాషలతో మీరు మాట్లాడేలా ఈ బడ్స్ ను రూపొందించారు.

గూగుల్ పిక్సెల్ కార్యక్రమంలో ..
గూగుల్ ఫిక్సల్ ఫోన్లలో సరికొత్తగా బడ్స్ ఆప్సన్ ను ప్రవేశపెట్టారు.ఇటీవల జరిగిన గూగుల్ పిక్సెల్ కార్యక్రమంలో భాగంగా ఈ బడ్స్‌ను విడుదల చేశారు.

40 భాషలతో..
చేతిలో గూగుల్ పిక్సెల్ ఫోన్.. ‘బడ్స్'ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు. మీరు 40 భాషలు నేర్చేసుకోవచ్చు. ఈ బడ్స్ 40 భాషలను తర్జుమా చేసి వినిపిస్తాయి.

ఒక తీగతో కనెక్ట్
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగా ఇవి నేరుగా స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌కు అనుసంధానమై ఉండవు. కానీ రెండు చెవుల్లో ఉంచుకునే ఫోన్స్ మాత్రం ఒక తీగతో కనెక్ట్ అయి ఉంటాయి.

కుడివైపు ఇయర్‌ఫోన్‌పై
అంతేకాకుండా కుడివైపు ఇయర్‌ఫోన్‌పై ఓ టచ్‌ప్యాడ్ ఉంటుంది. దీనిద్వారా మ్యూజిక్‌ను కంట్రోల్ చేయొచ్చు. బడ్స్‌లో ఉన్న గూగుల్ అసిస్టెంట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని మ్యూజిక్‌ను మన మాటలతోనే కంట్రోల్ చేయొచ్చు.

గూగుల్ ట్రాన్స్‌లేట్ సాఫ్ట్‌వేర్ ద్వారా
పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే గూగుల్ ట్రాన్స్‌లేట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏ భాషనైనా ఇంకో భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తాయి. అవతలి వ్యక్తి మాట్లాడుతూండగానే.. తర్జుమా చేసిన మాటలు మనకు వినిపించడం విశేషం.

మీరు మాట్లాడే భాష తాలూకూ భాషను ..
కుడిచెవిలోని వేళ్లతో టచ్ చేసి ఫలానా భాష మాట్లాడేందుకు సాయం చేయాలని అడగటమే ఆలస్యం గూగుల్ ట్రాన్స్‌లేట్ పనిలో పడిపోతుంది. మీరు మాట్లాడే భాష తాలూకూ భాషను స్పీకర్ ద్వారా ఎదుటి వ్యక్తికి వినిపించొచ్చు.

ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజీ చదివేందుకు ..
దీని ధరించడం ద్వారా ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజీ చదివేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదన్నమాట!


Click it and Unblock the Notifications








