గూగుల్ మరో ఆవిష్కరణ ‘Pixel Buds’

Posted By: BOMMU SIVANJANEYULU

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ 'Pixel Buds’ పేరుతో విప్లవాత్మక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్‌తో వస్తోన్న ఈ ఇయర్‌ఫోన్‌లను గెస్ట్యర్స్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. కుడివైపు బడ్ పై టాప్ చేయటం ద్వారా మ్యూజిక్‌ను play లేదా pause చేసుకునే వీలుంటుంది.

గూగుల్ మరో ఆవిష్కరణ  ‘Pixel Buds’

ఈ బడ్ పై ముందుకు వెనక్కు స్వైపింగ్ చేయటం ద్వారా వాల్యుమ్‌ను increase లేదా decrease చేసుకునే వీలుంటుంది.

ఈ బడ్ పై లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఈ బడ్స్ ద్వారా కాల్స్ చేయటంతో పాటు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Apple AirPods తరహాలో ప్రత్యేకమైన కేస్‌లో పిక్సల్ బడ్స్‌ను ఛార్జ్ చేసుసుకునే వీలుంటుంది. సింగిల్ ఛార్జ్ పై 5 గంటల బ్యాకప్‌ను ఈ ఇయర్ ఫోన్స్ ఆఫర్ చేస్తాయి.

గూగుల్ క్లిప్స్.. మార్కెట్లోకి మరో అద్బుతమైన కెమెరా

గూగుల్ విప్లవాత్మక ఫీచర్లలో ఒకటైన రియల్ ట్రాన్స్‌లేషన్‌ను కూడా Pixel Buds సపోర్ట్ చేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించగలిగే ఈ ఫీచర్ ద్వారా రియల్ టైమ్‌లో లాంగ్వేజెస్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంటుంది.

ఇంగ్లీష్‌లో మాట్లాడే మాటలను అర్థం చేసుకుని వాటిని మనకు కావల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసి స్మార్ట్‌ఫోన్ స్పీకర్స్ ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంది. రిటైల్ మార్కెట్లో పిక్సల్ బడ్స్ ఇయర్ ఫోన్స్ ధర 159 డాలర్లు (మన కరెన్సీలో ఈ విలువ రూ.10,300). నవంబర్‌లో రిలీజ్ అవుతాయి. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Read more about:
English summary
Google Pixel Buds are the latest wireless earphones from Google that were showcased along with the Google Pixel 2 and Pixel 2 XL smartphones.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot