డాల్బీ అట్మాస్ సపోర్టుతో రెండు మేడ్ ఇన్ ఇండియా సౌండ్‌బార్‌లు.. ధర, ఫీచర్‌లు, సేల్ వివరాలు..!!
ప్రముఖ స్వదేశీ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Govo తాజాగా రెండు సౌండ్ బార్‌లను విడుదల చేసింది. ఇందులో గోవో గో (Govo Go Surround Soundbars) సరౌండ్ 975 మరియు 940 సౌండ్‌బార్‌లు ఉన్నాయి. ఇవి డాల్బీ అట్మాస్ సపోర్టును కలిగి ఉంటాయి. మేడ్ ఇన్ ఇండియా లో భాగంగా గుర్గావ్‌లోని మానేసర్ ప్లాంట్‌లో తయారుచేశారు.
గోవో గో సరౌండ్ సౌండ్‌బార్‌ల ధర రూ.12,999 గా ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఈ - కామర్స్ ఫ్లాట్‌ఫాం అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. త్వరలో ఫ్లిప్‌కార్ట్ లోనూ అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు రిలయన్స్ రిటైల్, విజయ్ సేల్స్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు.

డాల్బీ అట్మాస్ సపోర్టు, శక్తివంతమైన చిప్‌సెట్ :
గోవో సంస్థ ప్రకారం గో సరౌండ్ 975 మరియు 940 సౌండ్‌బార్‌లు గృహాల్లో మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయని తెలిపింది. ఈ సౌండ్‌బార్‌లు శక్తివంతమైన చిప్‌సెట్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన డాల్బీ అట్మాస్ అనుభూతిని అందిస్తాయి.
ఇంట్లో సౌకర్యవంతంగా కనెక్ట్ చేసుకోవచ్చు.. :
దీంతోపాటు అత్యాధునిక DSP సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు 2.1.2 కాన్ఫిగరేషన్‌తో అత్యుత్తమ ఆడియో నాణ్యతను అందిస్తుంది. ఈ సౌండ్‌బార్‌లు 400 watt అవుట్‌పుట్‌ను అందిస్తాయి. దీంతోపాటు ఇంట్లో ఏ చోట నుంచి అయినా సౌకర్యవంతంగా కనెక్ట్ చేసేందుకు అనువుగా ఉంటుంది.
గోవో గో సరౌండ్ కనెక్టివిటీ ఫీచర్లు :
గోవో గో సరౌండ్ 975 మరియు 940 సౌండ్‌బార్‌లు ఈ రెండు సౌండ్‌బార్‌లు HDMI, బ్లూటూత్ 5.3, AUX మరియు USB ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. మ్యూజిక్, సినిమాలు, న్యూస్ కోసం మూడు ఈక్వెలైజర్‌లను కలిగి ఉంటుంది.
గోవో తన టెక్నాలజీతో హోం ఆడియో విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు COO పియూష్ జలన్ తెలిపారు. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డాల్బీ సపోర్టుతో తక్కువ ధరకే సౌండ్ బార్‌లను అందించనున్నామని తెలిపారు.
డాల్బీ అట్మాస్ సపోర్టుతో కూడిన మరిన్ని ఉత్పత్తులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని గోవో సంస్థ వెల్లడించింది. గోవో గో సరౌండ్ 980 మరియు 965, 525W డాల్బీ ఆడియో 5.1 సరౌండ్ సౌండ్ బార్ సహా వైర్ సబ్ ఊఫర్‌ను కలిగి ఉంటుంది.
మరియు గోవో గో సరౌండ్ 880 మరియు 870, 240W డాల్బీ ఆడియో, 2.1 సరౌండ్ సౌండ్ బార్ ఉన్నాయి. గోవో గో సరౌండ్ 860 మరియు 800, 180 W డాల్బీ ఆడియో, 2.1 సరౌండ్ సౌండ్ బార్ ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








