సామ్‌సంగ్ స్టోర్‌లలో Harman Kardon ఆడియో ప్రొడక్ట్స్
ఆడియో ఎలక్ట్రానిక్స్ విభాగంలో లీడింగ్ బ్రాండ్‌గా కొనసాగుతోన్న 'హార్మన్ కార్డన్’ (Harman kardon) కొత్తశ్రేణి ఆడియో ప్రొడక్ట్స్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ లాంచ్ చేసిన రెండు డజన్లకు పైగా కొత్త ఉత్పత్తుల్లో బ్లుటూత్ పోర్టబుల్స్, హెడ్‌ఫోన్స్, హోమ్ అండ్ మల్టీ మీడియా ప్రొడక్ట్స్, కార్ ఆఫ్టర్‌మార్కెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.

తమ బ్రాండ్ నుంచి నూతనంగా లాంచ్ అయిన ఆడియో ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ పనితీరును కనబరుస్తాయని హార్మన్ కార్డన్ చెబుతోంది. మార్కెట్ విస్తరణలో భాగంగా తమకు సంబంధించిన JBL అలానే Harman Kardon ఆడియో ప్రొడక్ట్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 350 సామ్‌సంగ్ కీ బ్రాండ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ బ్రాండ్‌లలో ఒకటైన హార్మన్ కార్డన్, ఆటోమోటివ్ కనెక్టెడ్ టెక్నాలజీస్‌తో పాటు కన్స్యూమర్ అండ్ ఎంటర్‌ప్రైజ్ మార్కెట్స్ పైనా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తోంది. హార్మన్ కార్డన్ కంపెనీకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు.

హార్మన్ కార్డన్ లాంచ్ చేసిన కొత్త ఉత్పత్తుల వివరాలు.. JBL ఫ్లిప్ 4 వాటర్‌ప్రూఫ్ బ్లుటూత్ స్పీకర్, JBL పల్స్ 3 వాటర్‌ప్రూఫ్ బ్లుటూత్ స్పీకర్, హార్మన్ కార్డన్ ట్రావెలర్, OMNI+ సిరీస్, JBL సినిమా SB450 2.1 సౌండ్ బార్, ఇన్ఫినిటీ కప్పా పర్‌ఫెక్ట్ 600 ఆటోమోటివ్ స్పీకర్.
బెర్లిన్ వేదికగా జరిగిన IFA 2017లో భాగంగా హార్మన్ కార్డన్ తన లేటెస్ట్ ఆడియో ఇన్నవేషన్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో JBL లింక్ సిరీస్‌తో పాటు JBL బూమ్‌బాక్స్, JBL జేఆర్, JBL ఫ్రీ వంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2018 మొదటి క్వార్టర్ నుంచి ఇవి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
హార్మన్ కార్డన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ప్రొడక్ట్స్‌కు సంబంధించిన ధరలు రూ.1,119 నుంచి రూ.39,990 వరకు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన సామ్‌సంగ్ బ్రాండ్ స్టోర్‌లతో పాటు లార్జ్ ఫార్మాట్ రిటైల్ పార్టనర్స్ లానే వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.
జెబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్‌లకు సంబంధించిన కార్ ఆఫ్టర్ మార్కెట్ ప్రొడక్ట్స్ హార్మన్ ఎక్స్‌టెన్సివ్ ఛానల్ నెట్‌వర్క్‌తో లింక్ అయి ఉన్న 2000 పార్టనర్స్ వద్ద అందుబాటులో ఉంటాయి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు నగరాల్లో హార్మన్ కార్డన్‌కు సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








