అద్భుత ఫీచ‌ర్ల‌తో HiSense కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీలు విడుద‌ల‌!

|

గ్లోబల్ టీవీ బ్రాండ్ HiSense భారతదేశంలో త‌మ ఉత్ప‌త్తుల్ని క్ర‌మంగా విస్త‌రింప చేస్తోంది. తాజాగా, మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వాటిలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీ లైనప్ U7H TV కు చెందినవి కాగా, మ‌రొక‌టి A7H టోర్నాడో 2.0 TV సిరీస్ నుంచి వ‌స్తోంది.

 
అద్భుత ఫీచ‌ర్ల‌తో HiSense కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీలు విడుద‌ల‌!

U7H TV సిరీస్‌కు చెందిన టీవీలు డాల్బీ విజన్ IQకి మద్దతుతో 4K 120Hz ప్యానెల్‌లను ప్రదర్శిస్తాయి. కొత్త ప్రీమియం శ్రేణిలో ఉన్న 55-అంగుళాల మరియు 65-అంగుళాల స్మార్ట్ టీవీలు ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్, క్వాంటం డాట్ కలర్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయ‌ని కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాకుండా, ఇవి హెచ్‌డిఎమ్‌ఐ 2.1 మరియు e-ARC డాల్బీ అట్మోస్ వంటి సరికొత్త డిస్‌ప్లే మరియు ఆడియో సాంకేతికతలతో రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది.

HiSense U7H సిరీస్ టీవీల ధ‌ర‌లు:
HiSense U7H సిరీస్ టీవీలు గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. 65 అంగుళాల మోడల్ ధర రూ.71,990 గా నిర్ణ‌యించారు. అయితే 55-అంగుళాల మోడల్ ధర రూ.51,990కు అందుబాటులో ఉంది.

HiSense U7H సిరీస్ టీవీల ఫీచ‌ర్లు:
HiSense కొత్త U7H స్మార్ట్ టీవీ సిరీస్‌ గేమర్‌లకు బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. కొత్త U7H సిరీస్ 4K టీవీలు కేవలం 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించడమే కాకుండా పెద్ద స్క్రీన్‌లపై అంత‌రాయాలు లేని కన్సోల్ గేమింగ్ అనుభవాన్ని క‌లిగిస్తాయి. ఇందుకోసం వీటిలో ఆటో తక్కువ లేటెన్సీ మోడ్ (ALLM) టెక్‌ని అందించారు. చివరగా, ఈ టీవీలు స్క్రీన్ టీరింగ్ ఎఫెక్ట్‌ను నిరోధించడానికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)ని కూడా కలిగి ఉంటాయి.

రెండు మోడల్‌లు అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ అసిస్టెంట్‌లకు ఇన్‌బిల్ట్ స‌పోర్టు క‌లిగి ఉన్నాయి. HiSense కొత్త U7H స్మార్ట్ టీవీ సిరీస్‌తో ఉచితంగా రూ.5,990 విలువ గ‌ల Amazon Fire TV Stick 4Kని అందిస్తోంది, కొత్త టీవీ సిరీస్ తాజా సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతున్నప్పుడు మంచి అనుభూతిని క‌ల్పిస్తుంది.

అద్భుత ఫీచ‌ర్ల‌తో HiSense కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీలు విడుద‌ల‌!

మ‌రో టీవీ A7H టోర్నాడో 2.0 TV సిరీస్ నుంచి వ‌స్తోంది. ఇది 55-అంగుళాల తో 102W JBL 6-స్పీకర్ సిస్టమ్‌తో తీసుకువస్తున్నారు. 55-అంగుళాల స్క్రీన్ సైజ్ క‌లిగిన ఈ టీవీ Google TV ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. స్మార్ట్ టీవీ HDR 10కి మద్దతు ఇస్తుంది మరియు డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్‌తో కూడా వస్తుంది. 55-అంగుళాల A7H టోర్నాడో 2.0 TV కి అధునాత‌న రిమోట్ అందిస్తున్నారు. అది ట్రాకర్‌ను కలిగి ఉంటుంది. కొత్త 55-అంగుళాల టీవీలో ఇన్‌బిల్ట్ Chromecast ఉంది మరియు Apple AirPlay మరియు Apple Home Kitకి మద్దతు ఇస్తుంది.

 

కొత్త U7H సిరీస్ టీవీల మాదిరిగానే, A7H స్మార్ట్ టీవీ కూడా ఫ్లూయిడ్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) & వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)తో వస్తుంది. 55-అంగుళాల A7H-సిరీస్ టీవీ ధర రూ.42,990 గా నిర్ణ‌యించారు. ఇవి Amazon మరియు Flipkart.com రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

అద్భుత ఫీచ‌ర్ల‌తో HiSense కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీలు విడుద‌ల‌!

అదేవిధంగా, ఇటీవ‌ల INFINIX కంపెనీ నుంచి INFINIX 4K QLED టీవీ లాంచ్ అయింది. దాని గురించి కూడా తెలుసుకుందాం:
భారతదేశ మార్కెట్లో INFINIX 4K QLED టీవీ ధర:
Infinix ఇప్ప‌టివ‌ర‌కు రెండు మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మొద‌టిది Infinix 50X3 4K టీవీ.. దీని ధర రూ.24,990 గా నిర్ణ‌యించింది. ఇక రెండోది Infinix Zero 55-అంగుళాల QLED 4K TV దీని ధ‌ర‌ను రూ. 34,990 గా నిర్ణ‌యించింది. రెండు టీవీలు దేశంలో వచ్చే వారం అమ్మకానికి రానున్నాయి.

INFINIX 4K QLED టీవీ స్పెసిఫికేషన్‌లు:
ఈ టీవీకి సంబంధించి స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఈ టీవీ 55 అంగుళాల డిస్‌ప్లేను క‌లిగి ఉంది. 4K QLED ప్యానెల్ అందిస్తున్నారు. అంతేకాకుండా, Infinix కంపెనీ ఈ మోడల్ కోసం ప్రీమియం డిజైన్‌పై దృష్టి సారించినట్లు పేర్కొంది. ఇది స్క్రీన్‌పై 1.6mm బెజెల్‌లను మరియు టీవీకి మంచి లుక్ అందించే x-బ్లేడ్ మెటల్ స్టాండ్‌ను కలిగి ఉంటుంది. డాల్బీ విజన్ ఫీచ‌ర్‌తో వస్తుంది మరియు హై-డెఫినిష‌న్‌ వీక్షణ అనుభవం కోసం HDR10+కి మద్దతు ఇస్తుంది. ఇది 400 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

ఈ టీవీ 2GB RAM మరియు 16GB స్టోరేజ్‌తో కూడిన MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Infinix కంపెనీ ఈ 4K TVలో Android TV 11 వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఈ TV మూడు HDMI పోర్ట్‌లను కలిగి ఉంది. ఇంకా.. కనెక్టివిటీ కోసం ARC, రెండు USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, LAN పోర్ట్, Wi-Fi మరియు హెడ్‌ఫోన్ జాక్‌లకు మద్దతు ఉంది. అంతేకాకుండా, డాల్బీ అట్మోస్ కోసం ఆప్టిమైజ్ చేసిన రెండు 36W బాక్స్ స్పీకర్లు మరియు ట్వీటర్‌లను పొంద‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
HiSense U7H TV Series smarttv launched in india.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X