శాంసంగ్ 'గెలాక్సీ రింగ్' బాటలోనే హానర్.. స్మార్ట్ రింగ్‌పై సంస్థ కీలక ప్రకటన..!!
ఇటీవల కాలంలో అనేక సంస్థలు స్మార్ట్ రింగ్‌లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024) సదస్సులో శాంసంగ్ తన గెలాక్సీ రింగ్‌ను ఆవిష్కరించింది. అయితే తాము కూడా స్మార్ట్ రింగ్‌ను తయారీ చేస్తున్నట్లు హానర్ సంస్థ వెల్లడించింది. ప్రధానంగా ఈ స్మార్ట్ రింగ్ యూజర్ల ఆరోగ్యంపై దృష్టిసారిస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం హానర్ సంస్థ స్మార్ట్ రింగ్‌ను (Honor Smart Ring) అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్‌తో ఈ హానర్ స్మార్ట్ రింగ్ అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఈవో జార్జ్ జాహా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని ఆరోగ్యపరమైన సలహాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత యాప్‌ల ద్వారా మెరుగైన సలహాలు సూచనలు అందుతాయని తెలిపారు. అలవాట్లు మరియు ఆరోగ్య సమాచారం ఆధారంగా సలహాలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం తొలిరోజుల్లో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ సంస్థ స్మార్ట్ రింగ్‌పైన ప్రకటన చేసింది. తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 సదస్సులో ఈ గెలాక్సీ రింగ్‌ను ఆవిష్కరించింది. ఈ రింగ్ అనేక సెన్సార్లను కలిగి ఉంటుందని పేర్కొంది. మరియు హార్ట్ రేట్ వంటి హెల్త్ ట్రాకర్లతో వస్తుంది.
కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ కూడా ఈ తరహా స్మార్ట్ రింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆపిల్ రింగ్ ఆలోచన దశలోనే ఉన్నట్లు సమాచారం. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి, కేలరీల ఖర్చు వంటి ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకర్లను కలిగి ఉంటుందని సమాచారం.
* ఇప్పటికే బోట్, నాయిస్ సంస్థలు స్మార్ట్ రింగ్‌లను విడుదల చేశాయి. నాయిస్ సంస్థ లూనా రింగ్ పేరుతో గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదల చేసింది. లూనా స్మార్ట్ రింగ్ టైటానియం బాడీని కలిగి ఉంటుంది. మరియు డైమండ్ పూతతో వస్తుంది. ఎక్కువకాలం మన్నిక వచ్చే విధంగా మరియు గీతలు, తుప్పు పట్టకుండా కాపాడుతుంది. నాయిస్ లూనా రింగ్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది.
నాయిస్ లూనా స్మార్ట్ రింగ్ కేవలం 3 నుంచి 4 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మరియు 2.8mm మందం ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రత, SpO2 మానిటర్, స్లీప్, యాక్టివిటీ ట్రాకింగ్ సహా అనేక ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ ఫలితాలను నాయిస్ ఫిట్ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. స్మార్ట్ రింగ్‌ను 90 నుంచి 120 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. నాయిస్ లూనా స్మార్ట్ రింగ్ సింగిల్ ఛార్జింగ్‌తో 6 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని తెలిపింది.
*Boat స్మార్ట్ రింగ్ ఆగస్టు నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగ్ హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌లను కలిగి ఉంటుందని బోట్ తెలిపింది. దీంతోపాటు నిద్ర నాణ్యత సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్ చేయగలదని తెలిపింది. ఈ రింగ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.
ఈ రింగ్ రన్నింగ్, వాకింగ్, రైడింగ్, ఇండోర్, అవుట్‌డోర్ ట్రాకింగ్ సహా అనేక రకాల వ్యాయామాలను ట్రాక్ చేయగలదు. ఈ సమాచారాన్ని బోట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ శరీర కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆరు యాక్సిస్ మోషన్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం SOS మోడ్‌తో వస్తుంది. ఈ బోట్ స్మార్ట్ రింగ్ ధర రూ.8,999గా ఉంది.


Click it and Unblock the Notifications








