12రోజుల బ్యాటరీ లైఫ్‌తో స్మార్ట్‌వాచ్, 35గంటల ప్లేబాక్ టైంతో ఇయర్‌బడ్స్‌ను విడుదలచేసిన Honor..సేల్ వివరాలు!
హానర్ సంస్థ భారత్ మార్కెట్‌లో క్రమంగా తన ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇవాళ హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ సహా హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ X5 (Honor Choice earbuds X5) మరియు హానర్ ఛాయిస్ వాచ్‌ను (Honor Choice Watch) విడుదల చేసింది.
హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ X5లో అత్యున్నత ఆడియో క్వాలిటి, నాయిస్ క్యాన్సిలేషన్‌పై దృష్టిపెట్టినట్లు సంస్థ వెల్లడించింది. అధునాతన అల్గారిథమ్‌ను ఉపయోగించి 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్స్ హానర్ AI స్పేస్ టెక్నాలజీ మరియు బ్లూటూత‌్ 5.3కు మద్దతిస్తుంది. హానర్ ఇయర్‌బడ్స్ ద్వారా 9 గంటలపాటు నిరంతరాయంగా మ్యూజిక్ వినొచ్చని, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 35 గంటలపాటు ప్లే బ్యాక్ సమయం ఉంటుందని హానర్ వెల్లడించింది.

ఈ ఇయర్‌బడ్స్‌తోపాటు హానర్ సంస్థ హానర్ ఛాయిస్ వాచ్ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.95 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ బిల్డ్‌ఇన్ GPS, వన్ క్లిక్ SOS కాలింగ్ మరియు యాక్టివిటీ, హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది.
SATM వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని హానర్ తెలిపింది. హానర్ ఛాయిస్ వాచ్ 120 స్పోర్ట్స్ మోడల్‌లను కలిగి ఉంటుంది. మరియు బ్లడ్ ఆక్సీజన్, ఒత్తిడి పర్యవేక్షణ, స్లీప్ ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ X5 ధర రూ.1,999గా ఉంది. ఫిబ్రవరి 16 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అదే హానర్ ఛాయిస్ వాచ్ ధర రూ.6,499గా ఉంది. ఫిబ్రవరి 24 నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద వాచ్‌పైన రూ.500 తగ్గింపు ధరను సంస్థ ప్రకటించింది. ఈ రెండు డివైస్‌లు అమెజాన్, ExploreHonor.com మరియు ఇతర స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
హానర్ x9b స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2652*1200 రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మెరుగైన ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తుంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. హైఎండ్ వాచ్‌ల నుంచి ఈ డిజైన్‌ను తీసుకున్నారు.
ఈ హనర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ హానర్ కొత్త ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB-C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. మరియు ఫోన్ కిందవైపు స్పీకర్లను కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌తో వస్తుంది. బ్లూటూత్ 5.1, వైపై 802.11 సపోర్టుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








