టెక్నాలజీ ఎలా మారిపోయిందో చూసారా..?

ఇవాళ కనిపిస్తున్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్ డేట్‌లు షరామామూలు అయి పోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది. ఒక్కసారి పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే మనిషి ఏ మేరకు అభివృద్థి చెందాడో తెలుస్తుంది.

Read More : 2016లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్స్ ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ రోజుల్లో బ్రిక్ ఫోన్స్..

ఇటుకు రాయి పరిమాణంలో ఉండే అలనాటి బ్రిక్ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్‌లు భర్తీ చేసేసాయి. స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటంతో సాధరణ ఫోన్‌లకు డిమాండ్ తగ్గిపోతోంది.

వాక్‌మెన్‌లు ఎక్కడ..?

ఐపోడ్‌లు అందుబాటులోకి రావటంతో వాక్‌మెన్‌లు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకుంది.

పలకల స్థానాన్ని..

పలకల స్థానాన్ని పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌లు ఆక్రమించేస్తున్నాయి. పలకలు పట్టుకోవల్సిన చిన్నారులు  ఏకగా స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్లు పట్టుకుంటున్నారు.

ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు

పాత కాలం పర్సనల్ కంప్యూటర్ల స్థానంలోకి సరికొత్త ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు వచ్చి చేరాయి.

అందుబాటులోకి స్మార్ట్ టీవీలు

ట్రంకు పెట్టే తరహాలో ఉండే టెలివిజన్ సెట్‌లను నాజూకు రకం ఫ్లాట్ స్ర్కీన్ టీవీలు భూస్థాపితం చేసేసాయి.

సీడీలు డీవీడీలు స్థానాన్ని..

సీడీలు డీవీడీలు స్థానాన్ని పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు భర్తీ చేసేసాయి.

క్యామ్‌కార్డర్ స్థానాన్ని..

క్యామ్‌కార్డర్ స్థానాలను స్మార్ట్‌ఫోన్‌లు,  ఫ్లిప్ క్యామ్‌లు ఆక్రమించేస్తున్నాయి.

ఇంటర్నెట్ రాకతో...

అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ మనిషి జీవనశైలినే మార్చేసింది. బ్రౌజింగ్ అనేది నిత్యావసరంలా మారిపోయింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How technology has progressed through the years. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting