బుల్లి ప్రింటర్: ఫోటో దిగగానే ప్రింట్ తీసుకోవచ్చు, ధర కూడా తక్కువే

Written By:

మీరు టూర్ కెళ్లారా..అక్కడ అదిరిపోయే ఫోటోలు దిగారా..వాటిని ఎలాగైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకోసం అదిరిపోయే బుల్లి ప్రింటర్ మార్కెట్లోకి వచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫోటోలను అప్పటికప్పుడే ప్రింట్ తీసుకోవచ్చు.

గూగుల్ అభిమానులకు శుభవార్త, పిక్సల్ 2 ఫోన్ల డేట్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌పీ సరికొత్త బుల్లి ప్రింటర్

భారీగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం, సెల్ఫీలపై యువత మోజు నేపథ్యంలో హెచ్‌పీ సరికొత్త బుల్లి ప్రింటర్ ను రూపొందించింది. దీని పేరే ‘స్ప్రోకెట్‌.

పాకెట్ సైజులో ఉండే ఈ ప్రింటర్ ను

పాకెట్ సైజులో ఉండే ఈ ప్రింటర్ ను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీ ఫోన్‌ను జేబులో పెట్టుకున్నట్లే దీనిని కూడా మీరు జేబులో పెట్టుకుని మీకు నచ్చిన ప్రదేశంలో ఫోటోలు దిగి ప్రింట్ తీసుకోవచ్చు.

అధికారిక స్ప్రోకెట్ యాప్‌ను

వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుంచి అధికారిక స్ప్రోకెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆ తరువాత బ్లూటూత్‌ ద్వారా దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవాలి.

ఏ ఫోటో ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారో

అనంతరం ఏ ఫోటో ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకుని మీరు ప్రింట్ ఇస్తే సరిపోతుంది.

రూ .8,999

దీని ధరను కంపెనీ రూ. రూ .8,999గా నిర్ణయించింది. 2 X 3 inch sizeలో ఫోటోలు ప్రింట్ తీసుకోవచ్చు.

10-24 వయస్సు మధ్య ఉన్న లక్షలాదిమంది వినియోగదారుల కోసం

ముఖ్యంగా 10-24 వయస్సు మధ్య ఉన్న లక్షలాదిమంది వినియోగదారుల కోసం రూపొందించామనీ హెచ్‌పీ ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ రాజా కుమార్ రిషి తెలిపారు.

బడ్జెట్‌ ధరలతో పోలిస్తే

అత్యధిక పోలరాయిడ్ కెమెరాల బడ్జెట్‌ ధరలతో పోలిస్తే హెచ్‌పీ ప్యాకెట్‌ ప్రింటర్‌ ఎక్కువ ధర ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్లకు ఇది బాగా లాభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

మెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా

దీన్ని అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎరుపు, నలుపు , తెలుపు రంగుల్లో లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HP Sprocket Pocket-Sized Printer for Smartphones Launched in India Read More At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot