Home
Gadgets

Huawei 55-inch 4K స్మార్ట్ టీవీ ఫీచర్స్, ధరలు ఇవే...

నోవా 7 సిరీస్ మరియు మేట్‌ప్యాడ్‌తో పాటు హువాయి సంస్థ ఇప్పుడు తన 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇది 4K ఎల్‌సిడి స్క్రీన్, సరౌండ్ సౌండ్ కోసం ఎనిమిది స్పీకర్లు, వాయిస్ సహాయంతో స్మార్ట్ రిమోట్ వంటి మరిన్ని ఫీచర్ లను కలిగి ఉండి అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది.

స్మార్ట్ టెలివిజన్

స్టాండర్డ్ స్మార్ట్ టెలివిజన్ ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా హువాయి స్మార్ట్ స్క్రీన్ V55i TV పాప్-అప్ HD కెమెరా మరియు AI ఫిట్‌నెస్ 2.0 ఫంక్షన్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హువాయి V55i స్మార్ట్ TV యొక్క ధర

హువాయి V55i స్మార్ట్ TV యొక్క ధర

హువాయి 4K స్మార్ట్ టివి యొక్క అమ్మకాలు ఏప్రిల్ 26 నుండి చైనాలో మొదలుకానున్నాయి. 55-అంగుళాలు గల ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర RMB 3,799. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.40,000. ఇది బ్లాక్ మరియు సిల్వర్ డైమండ్ గ్రే కలర్ ఆప్షన్స్ లలో లభిస్తుంది.

 

 

 

హువాయి V55i స్మార్ట్ TV స్పెసిఫికేషన్స్

హువాయి V55i స్మార్ట్ TV స్పెసిఫికేషన్స్

హువాయి V55i స్మార్ట్ TV యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 55-inch ల 4K స్మార్ట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 90 శాతం DCI-P3 వైడ్ కలర్ గాముత్ మరియు MEMC మోషన్ కంపెన్సషన్ టెక్నాలజీకు మద్దతు ఇచ్చే LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్ టెలివిజన్ కాబట్టి ఇది హువాయి సంస్థ యొక్క సొంత ఎకోసిస్టం ద్వారా యాప్ లను రన్ చేస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో హోంగూ క్వాడ్-కోర్ స్మార్ట్ చిప్‌సెట్‌తో వస్తుంది.

 

 

 

ఫీచర్స్

ఫీచర్స్

హువాయి V55i స్మార్ట్ టీవీలో అతి పెద్ద హైలైట్ విషయానికి వస్తే ఇందులో అమర్చబడిన పాప్-అప్ కెమెరా. హువాయి స్మార్ట్ టీవీలో తక్కువ-కాంతిలో కూడా 1080p HD వీడియో కాల్స్ చేయడానికి పాప్-అప్ కెమెరా అమర్చబడి ఉంది. ఈ కెమెరా టీవీ యొక్క సెంటర్ టాప్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ స్మార్ట్ టెలివిజన్‌లో స్మార్ట్ ఆడియో సిస్టమ్ కూడా ఉందని హువాయి సంస్థ పేర్కొంది.

స్పీకర్లు

హువాయి V55i స్మార్ట్ టీవీ నాలుగు 10W స్పీకర్లు మరియు నాలుగు 2W స్పీకర్లను కలిగి ఉంది. ఆన్‌బోర్డ్‌లో 2.4 L పెద్ద సౌండ్ కేవిటీ స్పీకర్ ఉంది. AI ఫిట్‌నెస్ 2.0 ఫంక్షన్‌ను కలిగి ఉండడం వలన దీనిని వాయిస్ ఆదేశాల ద్వారా కూడా యాక్టివేట్ చేయవచ్చు. HDMI 2.0, 3-in-1 AV, DTMB మరియు USB 3.0 వంటి అన్ని రకాల అవసరమైన పోర్టులను కూడా ఈ టీవీలో ప్యాక్ చేయబడి

Best Mobiles in India

English summary
Huawei 55-inch 4K Smart TV Launched: Price, Specifications and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X