Home
Gadgets

14 రోజుల బ్యాటరీ లైఫ్‌, స్విమ్మింగ్‌, హెల్త్‌ ట్రాకర్‌లతో స్మార్ట్‌ బ్యాండ్ .. జూన్‌ 10 వరకు స్పెషల్‌ సేల్!

హువావే బ్యాండ్ 10 భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ బ్యాండ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే గ్లోబల్ మార్కెట్ విడుదల కాగా.. తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌బ్యాండ్‌లో అనేక సెన్సార్లు, హెల్త్‌ ట్రాకర్‌లు ఉన్నాయి. స్విమ్మింగ్‌ చేసే వారికి 95 శాతం కచ్చితమైన వివరాలను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

హువావే బ్యాండ్‌ 10 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
హువావే బ్యాండ్‌ 10 స్మార్ట్‌ బ్యాండ్‌ (Huawei Band 10) 1.47 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 194 x 368 పిక్సల్‌ రిజల్యూషన్‌, 282 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

Huawei Band 10 launched in india

హువావే బ్యాండ్ 10 ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లను సపోర్టు చేస్తుంది. నేవిగేషన్‌ కోసం ప్రత్యేకంగా సైడ్‌ బటన్‌ను కలిగి ఉంటుంది. మరియు 5 ATM రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ బ్యాండ్‌ కేవలం 14 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

95 శాతం కచ్చితమైన వివరాలు :
ఈ హువావే బ్యాండ్‌ 10 ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ స్విమ్మింగ్‌ చేసే వారికి మంచి ఆప్షన్‌గా ఉంటుందని సంస్థ చెబుతోంది. 9 యాక్సెస్‌ సెన్సార్‌, AI ఆధారిత స్ట్రోక్‌ రికగ్నైజేషన్ ఫీచర్‌లతో 95 శాతం కచ్చితమైన స్విమ్‌ స్ట్రోక్‌, ల్యాప్‌ డిటెక్షన్‌ వివరాలను అందిస్తుందని చెబుతోంది.

Huawei Band 10 launched in india

100 వర్కౌట్‌ మోడ్స్‌ :
ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ స్విమ్మింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, యోగా వంటి 100 వర్కౌట్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హువావే స్మార్ట్‌ బ్యాండ్‌ యాక్సెలిరోమీటర్‌, మాగ్నటోమీటర్‌, గైరోస్కోప్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ వెల్‌ బీయింగ్ అసిస్టెంట్ ద్వారా టిప్స్‌ ను అందిస్తుంది.

ఈ హువావే బ్యాండ్‌ 10 అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కూడా కలిగి ఉంది. ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, బ్లడ్‌ ఆక్సీజన్‌ మానిటర్‌ను కూడా కలిగి ఉంది. నిద్ర నాణ్యత, నిద్ర - హార్ట్‌ రేట్‌లో మార్పులను కూడా గుర్తిస్తుంది. మరియు ఒత్తిడి స్థాయిని కూడా పర్యవేక్షిస్తుంది.

14 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
హువావే బ్యాండ్ 10 ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఫుల్‌ ఛార్జింగ్ చేసేందుకు 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. మరియు కేవలం 5 నిమిషాల క్విక్‌ ఛార్జింగ్‌తో రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

హువావే బ్యాండ్‌ 10 ధర, సేల్ వివరాలు :
హువావే బ్యాండ్ 10 (పాలిమర్‌ కేస్‌) ధర రూ.6499 గా ఉంది. అదే అల్యూమినియం బాడీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.3699, రూ.4199 కే సొంతం చేసుకోవచ్చు. జూన్ 10 తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ హువావే బ్యాండ్‌ 10 స్మార్ట్‌బ్యాండ్‌ను అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పాలిమర్ కేస్‌ బ్యాండ్‌ బ్లాక్, పింక్‌ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. అదే అల్యూమినియం కేస్‌ బ్యాండ్‌ బ్లూ, గ్రీన్‌, మ్యాటీ బ్లాక్‌, పర్పుల్‌, వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei Band 10 launched in india with 14 days battery life at rs3699 Special Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X