Home
Gadgets

ప్రీమియం లుక్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లతో హువావే బ్యాండ్‌ 10.. త్వరలోనే భారత్‌లో విడుదల..!!

Huawei Band 10 : చైనాకు ప్రముఖ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ హువావే భారత్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చైనా మార్కెట్‌లో ఈ సంవత్సరం జనవరిలో విడుదల అయింది. భారత్‌ మార్కెట్‌లో ఈ హువావే బ్యాండ్ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ త్వరలో విడుదల కానుంది. హార్ట్‌ రేట్‌, ఒత్తిడి నిద్ర నాణ్యత సహా అనేక ట్రాకర్లను కలిగి ఉంటుంది. ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.

హువావే బ్యాండ్‌ 10 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హువావే బ్యాండ్‌ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ట్రాకర్‌ ధీర్ఘచతురస్రాకార డిజైన్‌లో డయల్‌ మరియు కుడి వైపున బటన్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. Gadgets 360 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

huawei band 10 may launch soon in india under Rs 5000 Price range here are the full details

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
హువావే బ్యాండ్‌ 10 అనేక మెరుగైన ఒత్తిడి, స్లీప్‌ మానిరిటరింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే డిజైన్, సెన్సార్‌లు సహా మెరుగైన అనుభూతిని అందిస్తుందని చెబుతోంది. బ్లూ, గ్రీన్‌, పర్పుల్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చైనా వేరియంట్ తరహాలోనే :
ఈ ట్రాకర్‌ చాలా వరకు చైనా వేరియంట్ తరహా ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో చైనాలో విడుదల అయిన హువావే బ్యాండ్‌ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌.. 1.47 అంగుళాల దీర్ఘచతురస్రాకార అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 194 x 368 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 282 పిక్సల్‌ డెన్సిటీ ను కలిగి ఉంది.

100 కు పైగా వర్కౌట్‌ మోడ్స్‌! :
ఈ ట్రాకర్‌లో యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, PPG సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు 100 కు పైగా వర్కౌట్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. హార్ట్‌ రేట్‌, శ్వాస క్రియ రేట్, SpO2 స్థాయిని పర్యవేక్షిస్తుంది. మరియు నిద్ర నాణ్యతను కూడా పర్యవేక్షిస్తుంది.

14 రోజుల వరకు వినియోగించుకోవచ్చు..! :
ఈ హువావే బ్యాండ్‌ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చైనా వేరియంట్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. మరియు కేవలం 45 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్‌ కానుందని తెలిపింది. ఈ ట్రాకర్‌ 50 మీటర్ల నీటి లోతు వరకు కూడా డ్యామేజీ కాకుండా ఉంటుంది.

హువావే బ్యాండ్‌ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఈ వారంలోనే భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అనేక హెల్త్‌ మరియు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. ఈ బ్యాండ్‌ 10 ధర రూ.5000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతోంది.

హువావే బ్యాండ్‌ 10 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫలితంగా ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం ఉంది. Gadgets 360 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Best Mobiles in India

English summary
huawei band 10 may launch soon in india under Rs 5000 Price range here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X