హువాయి బ్యాండ్ 4 ప్రో రిలీజ్... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి

|

హువాయి సంస్థ ఇప్పుడు తన స్మార్ట్ డివైస్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను జోడించింది. హువాయి బ్యాండ్ 4 ప్రో అనే పేరుతో ఈ స్మార్ట్ డివైస్ ను విడుదల చేసింది. హువాయి యొక్క తాజా బ్యాండ్ 4 ప్రో హృదయ స్పందన సెన్సార్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలను కొలిచే SpO2 సెన్సార్‌ కూడా ఉంటుంది. హువాయి బ్యాండ్ 4 ప్రో 0.95-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కాంటాక్ట్‌లెస్ పెమెంట్స్ చేయడానికి NFC మద్దతును కూడా అందిస్తుంది.

హువాయి బ్యాండ్ 4
 

ఇది 11 రకాల వ్యాయామాలను ట్రాక్ చేయగలదు. అలాగే ఏదైనా కార్యాచరణ కోసం హెచ్చరికను తెలిపే ఫీచర్ ను కలిగి ఉంది. ఇది సుదీర్ఘ నిశ్చల సెషన్లను గుర్తించడంలో వినియోగదారులకు సహాయ పడుతుంది. హువాయి బ్యాండ్ 4 ప్రోలో నావిగేషన్ కోసం అంతర్నిర్మిత GPS ఫీచర్ ఉంటుంది. అదనంగా హువాయి ఎంజాయ్ 10s ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

అన్‌లిమిటెడ్ కాలింగ్ మీద పరిమితిని తొలగించిన వోడాఫోన్

ధర మరియు లభ్యత

ధర మరియు లభ్యత

హువాయి బ్యాండ్ 4 ప్రో యొక్క ధర CNY 399 అంటే ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.4,000. ఇది బ్లాక్, పింక్ మరియు రెడ్ అనే మూడు కలర్ల ఎంపికలో లభిస్తుంది. ఇది ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12 నుండి దీనిని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. హువాయి బ్యాండ్ 4 ప్రో ను ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు.

ఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

హువాయి బ్యాండ్ 4 ప్రో 0.65-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 240x120 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. దీని డిస్ప్లేలో ఒకేసారి 40 చైనీస్ అక్షరాలను చూపించగలదు. వినియోగదారులు 100 ప్రీలోడ్ చేసిన వాచ్ ఫేస్‌లను అన్ లాక్ కోసం ఎంచుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే హువాయి బ్యాండ్ 4 ప్రోలో నావిగేషన్ కోసం అంతర్నిర్మిత GPS ఫీచర్ అందుబాటులో ఉంది. అలాగే కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను అనుమతించడానికి NFC మద్దతును కలిగి ఉంది.

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

ట్రాకర్‌
 

హువాయి బ్యాండ్ 4 ప్రో హృదయ స్పందన ట్రాకర్‌తో పాటు రక్తంలో ఆక్సిజన్ యొక్క సాంద్రతను కొలవగల SpO2 మానిటర్‌ను కలిగి ఉంటుంది. దీనిని సాధారణంగా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి అని పిలుస్తారు. ఇది ప్రాథమికంగా హువాయి బ్యాండ్ 4 యొక్క సూప్-అప్ వెర్షన్, స్లీప్ ట్రాకింగ్ కోసం అంతర్గత హువాయి ట్రూస్లీప్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. ఇది కొన్ని రకాల రన్నింగ్, స్విమ్మింగ్ మరియు సైక్లింగ్ వంటి 11 రకాల వ్యాయామాలను కూడా ట్రాక్ చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Huawei Band 4 Pro Launched: Price And Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X