14 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో స్మార్ట్‌వాచ్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
Huawei నుంచి భారత్ మార్కెట్ లోకి ఇవాళ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. Huawei Band 8 పేరుతో విడుదల చేసింది. ఈ వాచ్ నిద్ర, ఒత్తడి, బ్లడ్‌లో ఆక్సిజన్ స్థాయి, హార్ట్ రేట్ వంటి అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది. మరియు ఆల్‌వైజ్ ఆన్ డిస్‌ప్ల్ (Always on Display Features) ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ను సింగిల్ ఛార్జింగ్ ద్వారా 14 రోజులపాటు వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Huawei బ్యాండ్ 8 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 1.47 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 194*368 పిక్సల్ రిజల్యూషన్ మరియు 282 ppi పిక్సెల్ డెన్సిటీను కలిగి ఉంది. ఈ వాచ్ దీర్ఘచతురస్రాకార ప్యానల్, టచ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. వాచ్ కేస్‌ను పాలిమర్ మెటీరియల్స్, వాచ్ స్ట్రాప్ సిలికాన్ లేదా TPU తో తయారు చేశారు.

అనేక సెన్సార్‌లు సహా.. :
ఈ Huawei బ్యాండ్ 8 స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు అనేక సెన్సార్‌లను కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్, గైరోస్కోప్, మరియు ఆప్టికల్ హర్ట్ సెన్సార్‌లతో పనిచేస్తుంది. ఈ వాచ్ స్మార్ట్ ఫిట్‌నెస్ ట్రాకర్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని కలిగి ఉంది.
సొంత టెక్నాలజీ :
దీంతోపాటు ఈ వాచ్ సంస్థ సొంత ట్రూస్లీప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా నిద్రకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఒత్తిడి మరియు Sp02 స్థాయి వివరాలను అందిస్తుంది. ఈ వాచ్ మాగ్నటిక్ ఛార్జింగ్ పోర్టు, 5 ATM వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ కెమెరా కంట్రోల్, ఇన్‌కమింగ్ కాల్స్, మెసెజ్‌లకు వాచ్ నుంచే సమాధానం ఇవ్వొచ్చు.

14 రోజుల బ్యాటరీ లైఫ్ :
Huawei బ్యాండ్ 8 స్మార్ట్‌వాచ్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా 14 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. అదే భారీగా వినియోగిస్తే 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు. అదే Always On Display ఫీచర్ ఆన్‌లో ఉన్న సమయంలో 3 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌కు 45 నిమిషాల సమయం పడుతుంది.
Huawei బ్యాండ్ 8 ధర, సేల్ వివరాలు :
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ధర రూ.4,699 కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. సకురా పింగ్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో Huawei బ్యాండ్ 8 స్మార్ట్‌వాచ్ లభిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








