Huawei మేట్‌ప్యాడ్ T8 కొత్త టాబ్లెట్ లాంచ్!!! తక్కువ ధరలోనే...

|

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అన్ని కూడా ప్రస్తుతం తమ స్మార్ట్‌ఫోన్లతో పాటుగా మరి కొన్ని స్మార్ట్ డివైస్లను కూడా విడుదల చేస్తున్నారు. మార్కెట్ లో వీటికి కూడా మంచి డిమాండ్ ఉండడం మరొక గొప్ప విషయం. హువాయి సంస్థ కూడా ఇండియాలో కొత్తగా టాబ్లెట్‌ను విడుదల చేసింది.

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ ధరల వివరాలు

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ ధరల వివరాలు

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ రెండు వేరు వేరు వేరియంట్ లలో బడ్జెట్ ధరలో లాంచ్ అయింది‌. వైఫై వెర్షన్‌లో లభించే టాబ్లెట్ యొక్క ధర 9,999 రూపాయలు మరియు LTE వెర్షన్ ను 10,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 08-14, 2020 నుండే వీటి యొక్క ప్రీ-ఆర్డర్లు అందుబాటులోకి వచ్చాయి. హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ యొక్క మొదటి సేల్ ఇండియాలో సెప్టెంబర్ 15 నుండి మొదలుకానున్నాయి. ఈ హువాయి కొత్త టాబ్లెట్ యొక్క ఫీచర్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: ACT Broadband Plans: నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలతో అద్భుతమైన ఆఫర్లు...Also Read: ACT Broadband Plans: నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలతో అద్భుతమైన ఆఫర్లు...

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8 అంగుళాల అతి పెద్ద డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ట్రాంక్విల్ బ్లూ కలర్ ఎంపికలో లభిస్తుంది. ఈ హువాయి బ్రాండ్ మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ ఉపయోగిస్తున్న చిప్‌సెట్ పేరును సంస్థ ఇంకా వెల్లడించలేదు. హువాయి కొత్త టాబ్లెట్ 2.0GHz ఫ్రీక్వెన్సీతో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ బ్యాటరీ ఫీచర్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ బ్యాటరీ ఫీచర్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ 5,100mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 588 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది అలాగే 12 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు వెబ్‌పేజీ బ్రౌజింగ్‌ను మరియు 75 గంటల ఆడియో ప్లేబ్యాక్‌ను కూడా అందిస్తుంది అని సంస్థ గట్టిగా చెబుతున్నది. ఈ టాబ్లెట్ 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది EMUI 10 తో రన్ అవుతూ డార్క్ మోడ్‌ ఫీచర్ను కలిగి ఉంది. ఇందులో మూడవ పార్టీ యాప్ లను సులభంగా ఇంస్టాల్ చేయడానికి వీలుగా ఉంటుంది మరియు ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతును ఇస్తున్నట్లు కూడా సంస్థ తెలిపింది.

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ ప్రొటెక్షన్ ఫీచర్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్ ప్రొటెక్షన్ ఫీచర్

హువాయి మేట్‌ప్యాడ్ T8 టాబ్లెట్‌లో రికార్డర్, కెమెరా, మల్టీమీడియా మరియు కిడ్స్ పెయింటింగ్‌ వంటి యాప్ లు ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. ఇది పిల్లలకు అనుకూలమైనదిగా ఉంటుంది అని కంపెనీ చెబుతోంది. ఇందులో గల హెచ్చరిక ఫీచర్ ద్వారా పిల్లలు టాబ్లెట్‌ను ఎంత సమయం ఉపయొగిస్తున్నారో తనిఖీ చేయవచ్చు. ఇది మల్టీ-లేయర్డ్ ఐ ప్రొటెక్ట్ ఫీచర్ను కూడా కలిగి ఉంది. టాబ్లెట్ రక్షణ కోసం ఇది ఫ్లిప్ కవర్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Huawei MatePad T8 Tablet Released in India: India Price, Specifications and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X