స్మార్ట్ ఫోన్ ల విభాగంలో నమ్మకమైన బ్రాండ్ గా అవతరించిన Huawei ఇటు వేరబుల్ టెక్నాలజీ విభాగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ Huawei Watch 2 Pro పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వాచ్ కు eSIM సపోర్ట్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది. 4G/3G/2G నెట్ వర్క్ లను వాచ్ సపోర్ట్ చేస్తుంది. Android Wear 2.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ డివైస్ .. ఆండ్రాయిడ్ 4.4, ఐఓఎస్ 9.0 ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే స్మార్ట్ ఫొన్ లను సపోర్ట్ చేస్తుంది. బ్లుటూత్ (2.4GHz BT4.1 BLE + BR / EDR), వై-ఫై (2.4GHz 802.11 b / g / n), జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ వంటి కనెక్టువిటీ సదుపాయాలను ఈ వాచ్ లో హువావే నిక్షిప్తం చేసింది. Huawei Pay, Alipay, Wechat Pay వంటి పేమెంట్స్ యాప్స్ వాచ్ లో అందుబాటులో ఉంటాయి. ఐపీ68 రేటింగ్ తో వస్తోన్న ఈ వాచ్ వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెన్స్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. వాచ్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..1.2 ఇంచ్ అమోల్డ్ రౌండ్ స్ర్కీన్ (రిసల్యూషన్ కెపాసిటీ 390 times; 390 పిక్సల్స్), 326 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, Android Wear 2.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 2100 4 కోర్ ప్రాససర్, 768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 420mAh బ్యాటరీ, 3 - యాక్సిస్ గ్రావిటీ యాక్సిలరేషన్ సెన్సార్, 3 - యాక్సిస్ గైరోస్కోప్ సెన్సార్, 3 - యాక్సిస్ జియోమాగ్నటిక్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ప్రెజర్ సెన్సార్, కెపాసిటివ్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్. బెంగుళూరు వాసుల కోసం Uber కొత్త రైడ్ ఆఫ్షన్హువావే వాచ్ 2 ప్రో స్మార్ట్ వాచ్ ను, చైనా మార్కెట్లో JD.com ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. ధర yen;2588 (మన కరెన్సీలో సుమారుగా రూ.25,343). ఇండియాలో ఈ వాచ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సి ఉంది. nbsp;