క్రేజీ ఫీచర్లతో Huawei స్మార్ట్‌వాచ్

చైనా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Huawei Watch 2 పేరుతో ఈ స్మార్ట్ డివైస్ అందుబాటులో ఉంటుంది. వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో హువావే వాచ్ 2 (ధర రూ.20,999), హువావే వాచ్ 2 క్లాసిక్ (ధర రూ.25,999), హువావే వాచ్ 2 4జీ (ధర రూ.29,999). అమెజాన్ ఇండియాలో ఇవి ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతాయి. గూగుల్ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టం పై ఈ మూడు వాచ్‌లు రన్ అవుతాయి.

Read More : ఇండియాలో సెప్టంబర్ 22 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ప్రీ-ఆర్డర్స్

క్రేజీ ఫీచర్లతో Huawei స్మార్ట్‌వాచ్

హువావే వాచ్ 2 స్పెసిఫికేసన్స్.. 1.2 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 390×390పిక్సల్స్), ఆండ్రాయిడ్ వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ వేర్ 2100 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 768 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, నానో సిమ్ ను సపోర్ట్ చేసే విధంగా సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, జీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, ఆండ్రాయిడ్ పే ఇంకా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఐపీ68 రేటింగ్ విత్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 420mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Read More : నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

క్రేజీ ఫీచర్లతో Huawei స్మార్ట్‌వాచ్

హువావే వాచ్ 2 అలానే క్లాసిక్ మోడల్స్ కేవలం బ్లుటూత్ కనెక్టువిటీ పై మాత్రమే వర్క్ అవుతాయి. హువావే వాచ్ 2 4జీ (స్పోర్ట్స్) వేరియంట్ మాత్రమే 4జీ నెట్‌వర్క్ పై రన్ అవుతుంది. ఈ మూడు వాచ్‌లు ఆండ్రాయిడ్ అలానే యాపిల్ ఐఫోన్‌లను సపోర్ట్ చేస్తాయి.

English summary
Huawei Watch 2 smartwatch launched in India, price starts at Rs 20,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot