Home
Gadgets

10 రోజుల బ్యాటరీ లైఫ్‌, 1.74 అంగుళాల డిస్‌ప్లేతో Huawei వాచ్‌ ఫిట్‌ 2 విడుదల.. ధర, ఫీచర్‌లు..!

Huawei వాచ్‌ ఫిట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ భారత్‌ మార్కెట్‌లో (Huawei Watch Fit 2 Smartwatch Launched in India) ఇవాళ విడుదల అయింది. ఇప్పటికే ఈ వాచ్‌ యూరోపియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేక స్ట్రాప్‌లను కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 10 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్ సహా అనేక హెల్త్‌ ట్రాకర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌ 7 వర్కౌట్‌ మోడ్‌ లను కలిగి ఉంది.

Huawei వాచ్‌ ఫిట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
Huawei వాచ్‌ ఫిట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ 1.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 336*480 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 336 పిక్సల్ డెన్సిటీ ను తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే Always on Display ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Huawei watch fit 2 Smartwatch

ఈ స్మార్ట్‌వాచ్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంది. స్టోర్‌ నుంచి వాచ్‌ ఫేస్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీర్ఘచతురస్రాకార వాచ్‌ కేస్‌ను కలిగి ఉంది. ప్రెస్‌ టూ రిలీజ్‌ లింక్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు కుడి వైపు బటన్‌ను కలిగి ఉంది. GPS, Beidou, Glonass వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

Huawei వాచ్‌ ఫిట్‌ 2 హెల్త్ ట్రాకర్లు :
ఈ స్మార్చ్‌వాచ్‌ అనేక హెల్త్‌ సెన్సార్‌లను కలిగి ఉంది. ఆప్టికల్ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ (SpO2 మానిటర్‌), నిద్ర, ఒత్తిడి స్థాయి పర్యవేక్షణ వంటి ట్రాకర్లను కలిగి ఉంటుంది. Huawei హెల్త్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ 7 వర్కౌట్‌ మోడ్‌ లతో అందుబాటులోకి వచ్చింది.

Huawei watch fit 2 Smartwatch

గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
Huawei వాచ్‌ ఫిట్‌ 2 బ్లూటూత్‌ 5.2 ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. బ్లూటూత్‌ కాలింగ్‌, మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ లను ఫోన్ యాప్‌ ద్వారా నియంత్రించుకోవచ్చు. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువగా వినియోగించే యూజర్లకు 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. 5ATM వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

Huawei వాచ్‌ ఫీట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ ధర :
Huawei వాచ్‌ ఫీట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ ధర రూ.9,998 గా ఉంది. మిడ్‌నైట్‌ బ్లాక్‌ యాక్టివ్‌ ఎడిషన్‌ కలర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌ కొనుగోలుపై రూ.1000 తగ్గింపును పొందే అవకాశం ఉంది. గ్లోబల్‌ వేరియంట్‌లో మూడు కలర్‌ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei watch fit 2 Smartwatch upto 10 days of battery life launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X