Home
Gadgets

10 రోజుల బ్యాటరీ లైఫ్‌, AMOLED డిస్‌ప్లే, హెల్త్‌ ట్రాకర్‌లతో స్మార్ట్‌వాచ్‌లు విడుదల.. పూర్తి వివరాలు..!

Huawei Watch Fit 4 Series Smartwatches : భారత్‌ మార్కెట్‌లో ఇటీవల హువావే సంస్థ స్మార్ట్‌బ్యాండ్ లాంచ్ చేసింది. అయితే తాజాగా వాచ్‌ ఫిట్‌ 4 సిరీస్‌ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇందులో వాచ్ ఫిట్‌ 4, వాచ్ ఫిట్‌ 4 ప్రో మోడల్స్‌ ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ సిరీస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. హెల్త్‌ ట్రాకర్‌లతోపాటు ఈ సిరీస్‌ వాచ్‌లు అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

హువావే వాచ్ ఫిట్‌ 4 సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు అల్యూమినియం బాడీని కలిగి ఉన్నాయి. దీంతోపాటు నైలాన్‌, ఫ్లోరో ఎలాస్టోమర్ స్ట్రాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు ప్రత్యేకమైన హోమ్‌ బటన్‌ను కలిగి ఉన్నాయి.

Huawei Watch Fit 4 and Watch Fit 4 pro smart Watches launched in india with 10 Days battery life

డిస్‌ప్లే వివరాలు :
ఈ వాచ్‌ ఫిట్‌ 4 సిరీస్‌ స్మార్ట్‌వాచ్‌లు 1.82 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 480 x 408 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. మరియు 3000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 347PPI పిక్సల్స్‌ డెన్సిటీని కలిగి ఉంది.

హువావే వాచ్‌ ఫిట్‌ 4 మోడల్‌లో యాక్సెలిరోమీటర్ సెన్సార్‌, గైరోస్కోప్‌ సెన్సార్‌, మాగ్నిటోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఆప్టికల్ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, బారో మీటర్‌ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. ప్రో మోడల్‌ అనేక సెన్సార్‌లను కలిగి ఉంది. ఇందులో యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, మాగ్నటోమీటర్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, బారోమీటర్, టెంపరేచర్‌ సెన్సార్, ECG, డెప్త్‌ సెన్సార్‌లు ఉన్నాయి.

ఈ యాప్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు :
ఈ స్మార్ట్‌వాచ్‌ సిరీస్‌ హెల్త్‌ గ్లేన్స్‌ 2.0 ద్వారా హార్ట్‌ రేట్‌, ECG రీడింగ్స్‌, స్లీప్‌ ప్యాట్రన్స్‌, SpO2 ను పర్యవేక్షించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ సిరీస్‌ మైక్రోఫోన్‌ తోపాటు స్పీకర్‌ లను కలిగి ఉంది. ఈ వాచ్‌ ఇన్‌బిల్ట్‌ GPS ను సపోర్టు చేస్తుంది. HUAWEI హెల్త్ యాప్‌ ద్వారా ఈ వివరాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

హువావే వాచ్‌ ఫిట్‌ 4 సిరీస్‌ 5 ATM వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అయితే ప్రో మోడల్‌ ప్రత్యేకంగా IP6x డస్ట్ ప్రూఫ్‌ ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.2 ఫీచర్‌ ఆధారంగా బ్లూటూత్‌ కాలింగ్‌, NFC వంటి ఫీచర్లున్నాయి. ఈ వాచ్‌ Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
హువావే వాచ్‌ ఫిట్ 4 సిరీస్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆల్‌వేజ్‌ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ ఉపయోగిస్తుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ 4 రోజులుగా ఉంటుంది.

హువావే వాచ్‌ ఫిట్‌ 4 సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
Huawei వాచ్‌ ఫిట్‌ 4 స్మార్ట్‌వాచ్‌ ధర రూ.12999 గా ఉంది. అదే ప్రో మోడల్ ధర రూ.20999 గా ఉంది. రెండు ‌స్ట్రాప్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei Watch Fit 4 and Watch Fit 4 pro smart Watches launched in india with 10 Days battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X