Home
Gadgets

14 రోజుల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, హెల్త్‌ ట్రాకర్‌లతో స్మార్ట్‌వాచ్‌ విడుదల.. ఇవాళ్టి నుంచే సేల్‌

Huawei తన స్మార్ట్‌వాచ్‌ లైనప్‌ను క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో స్మార్ట్‌వాచ్‌ విడుదల అయింది. Huawei వాచ్‌ GT 4 వాచ్‌ను (Huawei Watch GT 4) లాంచ్‌ చేసింది. ఈ వాచ్‌ రొటేటింగ్‌ క్రౌన్‌, ఆక్టాగోనల్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్‌ను సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 14 రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇంటర్‌చేంజబుల్‌ స్ట్రాప్‌, హెల్త్‌ ట్రాకర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Huawei వాచ్‌ GT 4 స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు :
Huawei వాచ్‌ GT 4 స్మార్ట్‌వాచ్‌ 466*466 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే బ్లూమింగ్‌ వాచ్‌ ఫేస్‌ ఆప్షన్‌లు సహా కస్టమ్‌ వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌, iOS వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది.

Huawei Watch GT 4 Smartwatch

4GB అంతర్గత స్టోరేజీ :
ఈ Huawei వాచ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కేసింగ్‌తోపాటు బటన్, రొటేటింగ్‌ క్రౌన్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్‌ డిజైన్‌ తో విడుదల అయింది. ఈ స్మా్ర్ట్‌వాచ్‌ 32MB ర్యామ్‌ మరియు 4GB అంతర్గత స్టోరేజీ తో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇన్‌ బిల్ట్ మైక్రోఫోన్‌ మరియు స్పీకర్‌తో అందుబాటులో ఉంది.

ఈ Huawei వాచ్‌ GT 4 అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. Huawei Truseen 5.5+ టెక్నాలజీతో హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయి, నిద్ర నాణ్యత సహా అరిథ్మియా ప్రమాదాలను గుర్తిస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్‌ యాక్సిలిరోమీటర్‌, గైరోస్కోప్‌, మాగ్నటోమీటర్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్, బారోమీటర్‌, టెంపరేచర్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 14 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను పొందుతుందని సంస్థ చెబుతోంది.

Huawei వాచ్‌ GT 4 స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
Huawei వాచ్‌ GT 4 స్మార్ట్‌వాచ్‌ ధర రూ.14,999 గా ఉంది. ఈ వాచ్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు. తొలి 100 మంది కొనుగోలుదారులు రూ.500 చొప్పున డిస్కౌంట్‌ను పొందవచ్చు. గ్రీన్‌, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

*ఇటీవలే Huawei వాచ్‌ ఫిట్‌ 2 స్మార్ట్‌వాచ్‌ విడుదల అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ 1.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Always on Display ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీర్ఘచతురస్రాకార వాచ్‌ కేస్‌ను కలిగి ఉంది. ప్రెస్‌ టూ రిలీజ్‌ లింక్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్చ్‌వాచ్‌ అనేక హెల్త్‌ సెన్సార్‌లను కలిగి ఉంది. ఆప్టికల్ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ (SpO2 మానిటర్‌), నిద్ర, ఒత్తిడి స్థాయి పర్యవేక్షణ వంటి ట్రాకర్లను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువగా వినియోగించే యూజర్లకు 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. 5ATM వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌ ధర రూ.9,998 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei Watch GT 4 Smartwatch launched with 14 days battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X