14 రోజుల బ్యాటరీ లైఫ్, 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
భారత్ మార్కెట్‌లో ఇవాళ Huawei వాచ్ GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ (Huawei Watch GT 5 Pro Smartwatch) విడుదల అయింది. ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 14 రోజులపాటు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. మరియు ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ తో అందుబాటులోకి ఉంది. ఈ వాచ్ 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
హువావే వాచ్ GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
హువావే వాచ్ GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 466*466 పిక్సల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఈ వాచ్ రొటేటింగ్ క్రోన్‌ను అమర్చి ఉంది.

హార్ట్ రేట్ సహా అనేక హెల్త్ ట్రాకర్‌లు :
ఈ హువావే వాచ్ 5 ప్రో అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్ చేసే ఫీచర్ సహా అనేక ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలిరోమీటర్, బారో మీటర్, డెప్త్ సెన్సార్, గైరో స్కో్ప్, మాగ్నిటోమీటర్, టెంపరేచర్ సెన్సార్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.
IP69 రేటింగ్, 5 ATM రేటింగ్ :
హువావే స్మార్ట్‌వాచ్ 5 ATM మరియు IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ వంద కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో అందుబాటులో ఉంది. స్మార్ట్‌వాచ్ ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ వాచ్ బ్లూటూత్ 5.2, వైఫై, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.
14 రోజుల బ్యాటరీ లైఫ్..! :
ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 14 రోజులపాటు వినియోగించుకోవచ్చని హువావే సంస్థ చెబుతోంది. అయితే ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ఉపయోగించిన సమయంలో సింగిల్ ఛార్జింగ్‌తో 5 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని తెలిపింది.
భారత్ ఈ వేరియంట్ మాత్రమే లభిస్తుంది! :
ఈ స్మార్ట్‌వాచ్ గ్లోబల్ మార్కెట్‌లో 42mm, 46mm సైజు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే భారత్ మార్కెట్‌లో కేవలం 46mm ఆప్షన్‌లోనే లభిస్తుంది. ఈ వాచ్ 53 గ్రాములు బరువు ఉంది. అయితే రెండు ఎడిషన్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
హువావే GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ ధర, సేల్ వివరాలు :
హువావే GT 5 ప్రో స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ.29,999 గా ఉంది. బ్లాక్ సిలికాన్ స్ట్రాప్‌తో కూడిన స్పోర్ట్స్ ఎడిషన్‌ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే టైటానియం స్ట్రాప్‌తో కూడిన క్లాసిక్ ఎడిషన్ ధర రూ.39,999 గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








