Home
Gadgets

14 రోజుల బ్యాటరీ లైఫ్‌, GPS, హెల్త్‌ ట్రాకర్లతో Huawei స్మార్ట్‌వాచ్‌... ఫీచర్‌లు, ధర, సేల్ వివరాలు..!

ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ Huawei భారత్‌ మార్కెట్‌లో వాచ్ GT 5 ను లాంచ్‌ చేసింది. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ వాచ్‌ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 14 రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ Huawei Watch GT 5 వాచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

Huawei వాచ్‌ GT 5 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ వాచ్‌ 41mm, 46mm రెండు వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 41mm వేరియంట్‌ 1.32 అంగుళాల (466*466 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 352 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. అదే 46mm వేరియంట్‌ 1.43 అంగుళాల (466*466 పిక్సల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 326ppi పిక్సల్‌ డెన్సిటీతో అందుబాటులోకి వచ్చింది.

Huawei watch GT 5 Smartwatch launched in india

ఈ Huawei వాచ్‌ GT 5 స్మార్ట్‌వాచ్‌ 100 స్పోర్ట్స్‌ మోడ్స్‌ను కలిగి ఉంటుంది. మరియు Always On Display ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ రొటేటింగ్‌ క్రౌన్‌, సైడ్‌ బటన్‌ను కలిగి ఉంటుంది. IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 5ATM వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ను కలిగి ఉంది.

ఈ వాచ్‌ మహిళల్లో రుతుక్రమాన్ని ట్రాక్‌ చేస్తుంది. మరియు నిద్ర నాణ్యత, పల్స్‌ వేవ్‌ అరిథ్మియాను విశ్లేషిస్తుంది. Huawei Trusense ఫీచర్‌ 60 ఆరోగ్య మరియు ఫిట్‌నెస్‌ మెట్రిక్స్‌ను ఉపయోగించుకుంటుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక సెన్సార్‌లను కలిగి ఉంటుంది. టెంపరేచర్‌ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, మాగ్నటోమీటర్‌ సెన్సార్, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, యాస్సెలిరోమీటర్‌, బారోమీటర్ వంటి సెన్సార్‌ను కలిగి ఉంది.

46mm వేరియంట్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 14 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. అదే 41mm వేరియంట్‌ను సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు వినియోగించుకోవచ్చు. అయితే ఆల్‌వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్ ఉపయోగిస్తున్న సమయంలో బ్యాటరీ లైఫ్‌ తక్కువగా ఉంటుందని సంస్థ తెలిపింది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ ఆండ్రాయిడ్‌, iOS లను సపోర్టు చేస్తుంది. GPS, బ్లూటూత్‌ 5.2, Huawei సన్‌ఫ్లవర్‌ పొజిషనింగ్‌ సిస్టమ్ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. 46mm వేరియంట్‌ బరువు 48 గ్రాములుగా ఉంది. అదే 41mm వేరియంట్‌ 35 గ్రాములుగా ఉంది.

వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
Huawei వాచ్‌ GT 5 రెండు వేరియంట్‌లు అక్టోబర్‌ 20 నుంచి భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ముందస్తు బుకింగ్‌ చేసుకోవడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చని సంస్థ తెలిపింది.

ఈ వాచ్‌ 41mm వేరియంట్‌ ప్రారంభ ధర రూ.15,999 గా ఉంది. బ్లూ (ఫ్లోరోఎలాస్టోమర్‌), బ్లాక్‌ (ఫ్లోరోఎలాస్టోమర్‌), బ్రౌన్‌ (ఉవెన్‌), వైట్‌ (కాంపోజిట్‌ లెదర్‌) స్ట్రాప్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. అదే గోల్డ్‌ (మిలనీస్‌) వేరియంట్ ధర రూ.21,999 గా అంది. 46mm వేరియంట్ ప్రారంభ ధర రూ.16,999 గా ఉంది. బ్లూ (ఉవెన్‌), బ్లాక్‌ (ఫ్లోరోఎలాస్టోమర్‌), బ్రౌన్‌ (కాంపోజిట్ లెదర్‌) స్ట్రాప్‌ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei watch GT 5 Smartwatch launched in india with 14 days of battery life price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X